ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ బృందంలోని వారికి శాఖలను కేటాయించారు. అయితే.. అందరూ ఊహించినట్టుగానే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు. ఇది ఆయనకు సముచిత గౌరవమే కాదు.. ఒకరకంగా చెప్పాలంటే పెద్దపీట వేశారనే అనాలి. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలతో కూడిన హోం శాఖ తర్వాత.. ఆర్థిక శాఖ అత్యంత కీలకం. గతంలో యనమల రామకృష్ణుడు ఈ పోస్టును చేశారు.
ఎన్నికలతో సంబంధం లేకుండా.. గెలిచినా ఓడినా.. ఆయననే చంద్రబాబు తీసుకున్నారు.కానీ, ఈ సారి మాత్రం పంథా మార్చుకుని పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు పెద్ద పీట వేశారు. గతంలో వైసీపీ హయాం లో పయ్యావుల ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు. దీంతో ఆయనకు చంద్రబాబు మంచి ప్రాధాన్యం ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్న పయ్యావులను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఇక, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డికి ఊహిం చని పదవి వరించింది. ఆయన గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి జమానా లో ఆర్థికమంత్రిగా చేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే ఆశించారు. కానీ, చంద్రబాబు ఆనంకు ఊహించ ని విధంగా దేవదాయ శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. దీనికి కూడా ప్రాధాన్యం ఉంది. ఇదేమీ తక్కువ కాదు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్న దరిమిలా.. ఆనంకు ఉత్తమ పోస్టు ఇచ్చారనే చెప్పాలి.
కొలుసుకు కూడా..
వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు జంప్ చేసి టీడీపీ బాట పట్టిన కొలుసు పార్థసారథికి కూడా.. చంద్రబా బు ప్రాధాన్యం ఉన్న పదవినే అప్పగించారు. సమాచార శాఖ సహా కీలకమైన హౌసింగ్ శాఖను కూడా అప్పగించారు. దీనిలో ఎక్కువగా పనిచేసేందుకు స్కోప్ కల్పించే శాఖ హౌసింగ్. వచ్చే ఐదేళ్లలో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న చంద్రబాబు హామీని ఈయన సాకారం చేసేందుకు అవకాశం ఉంది. మొత్తంగా ఇద్దరు జంపింగులకు కూడా మంచి పదవులు ఇవ్వడం గమనార్హం.
This post was last modified on June 14, 2024 2:56 pm
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…