తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం ఆ పార్టీలోని కీలక నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. అయితే.. పైకి మాత్రం అందరూ గుంభనంగా ఉంటున్నారు. కానీ, ఒకరిద్దరు మాత్రం ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. వీరిలో కీలక నాయకుడు, నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన.. మాజీ మంత్రి అనిల్ కుమార్.. ఒకరు. ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఓడిపోవడానికి కొందరు నేతలు చేసిన దూల వ్యాఖ్యలే కారణమంటూ.. సోషల్ మీడియాలో జరుగు తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఔను. నిజమై ఉండొచ్చు. మా నోటి దూలే ఓడించిందని నాకు కూడా కొందరు చెప్పారు. ఇదినిజమైతే.. మా నోటిని మేం కంట్రోల్ చేసుకుంటాం అని అనిల్‌కుమార్ యాదవ్ స్పందించారు. ఇక, తాను ఎన్నికలకు ముందు చేసిన శపథంపై ఆయన స్పందించారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
ఇదే విషయంపై అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నిజమే. నేను ఆ శపథం చేశాను. ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. కానీ, అప్పట్లో ఈ శపథాన్ని ఎవరూ స్వీకరించలేదు. ఓకే నువ్వు అలా నే చెయ్యి.. మేం ఓడిపోతే కూడా ఇలానే చేస్తాం.. అని ఎవరైనా అని ఉంటే.. తప్పకుండా ఇప్పుడు నేను రాజకీయాలను వదిలేస్తా. కానీ, ఎవరూ నేను చేసిన శపథాన్నిస్వీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్నే రాదు. అయినా.. ఎవరి కోసం రాజకీయాలు వదిలేయాలి అని అనిల్ ప్రశ్నించారు.
ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయని అనిల్ చెప్పారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగిందన్నారు. ప్రస్తుతం తాము వినే పరిస్థితిలో ఉన్నామని,, టీడీపీ నాయకులు చెప్పే పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కాలం గిర్రున తిరుగుతుందని.. పరిస్థితులు మారతాయని అన్నారు. ఈ ఐదేళ్లు తాము ప్రజల వెంటే ఉంటామని.. ఎక్కడి పారిపోబోమని అనిల్ తెలిపారు. అయితే.. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని.. తర్వాత తాము కూడా.. ప్రశ్నించడం ప్రారంభిస్తామని అన్నారు.
This post was last modified on June 14, 2024 3:33 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…