Political News

700 కోట్లు మింగేసిన గొర్రెలు? ఈడీ కేసు

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గొర్రెల పంపిణీ వ్య‌వ‌హారం.. వివాదంగా మారింది. ఈ పంపిణీ ప‌థ‌కంలో అవినీతి చోటు చేసుకుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో ఏసీబీ అధికారులు దీనిపై గ‌త నెల రోజులుగా సైలెంట్ విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో వారు జ‌రిపిన విచార‌ణ సంచ‌ల‌నంగా మారి.. గొర్రెల పంపిణీ ప‌థ‌కంలో ఏకంగా 700 కోట్ల రూపాయ‌ల మేర‌కు మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగిన‌ట్టు గుర్తించారు.

ఆవెంట‌నే కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ)కి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్న‌ట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం అధికారి ఒక‌రు లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ వెంట‌నే ఏసీబీ న‌మోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారుల కూడా ప్రాథ‌మికంగా కేసును న‌మోదు చేశారు.

ప్ర‌స్తుతం విచార‌ణ‌ను కూడా ఈడీ అధికారులు ప్రారంభించారు. మనీలాండరింగ్ చట్టం కింద, ఈసీఐ ఆర్ నమోదు చేశారు. ఈ కుంభ‌కోణ‌లో ప‌ది మంది పాత్ర ఉన్న‌ట్టు ప్రాథ‌మికంగా ఏసీబీ అధికారులు గుర్తిం చారు. వీరిలో ఇద్ద‌రు మాజీ మంత్రుల కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో ఆయా వివ‌రాల‌ను అత్యంత గోప్యంగా ఉంచారు. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నేత‌లు మౌనంగా ఉన్నారు.

ఏంటీ ప‌థ‌కం..

బీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అప్ప‌టి ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లోని ప‌శుపాల‌కుల‌కు.. గొర్రెల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఏపీ, మ‌హారాష్ట్ర స‌హా ఐదు రాష్ట్రాల నుంచి నాణ్య‌మైన గొర్రెల‌ను కొనుగోలు చేసి..తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పంపిణీ చేశారు. ఈ క్ర‌మంలో భారీ ఎత్తున సొమ్ములు.. దోచుకున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనిపైనే తెలంగాణ ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఏసీబీని రంగంలోకి దించ‌గా.. రూ.700 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు ప్రాధమికంగా గుర్తించారు.

This post was last modified on June 14, 2024 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

33 mins ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

4 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

4 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

5 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

6 hours ago