ఒక ఓటమి నాయకుల్లో మార్పు తీసుకువస్తుంది. ఒక పెద్ద ఘోర పరాజయం పార్టీలను మార్పు దిశగా అడుగులు వేయిస్తుంది. ఇది మనకు 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ.. ఇప్పటికి ఆ పార్టీ లో వచ్చిన మేలిమి మార్పును కళ్లకు కడుతుంది.
అనేక మంది వివాదాస్పద నాయకులకు చంద్రబాబు చెక్ పెట్టారు. తనను తాను ప్రజలకు మరింత చేరువ చేసుకున్నారు. ప్రజల నాడి పట్టుకున్నారు. తన ఆలోచనలకు విరుద్ధమే అయినా.. ప్రజలు ఉచితాలు కోరుకుంటున్నారని తెలుసుకుని వాటి వైపే పయనించారు.
ఇక, ఇతర పార్టీలను కలుపుకొంటే తప్ప.. విజయం దక్కడం సాధ్యం కాకపోవచ్చని అంచనా వేసుకున్నారు. దీంతో చంద్రబాబు మారిన మనిషిగా ముందుకు సాగారు. ఫలితం కళ్ల ముందు కనిపిస్తోంది. కొంత తగ్గినా.. ఆయన భారీగా నెగ్గారు. కనీ వినీ ఎరుగని రీతిలో విజయం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. కేంద్రాన్ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇదంతా కూడా.. మార్పు దిశగా వేసిన అడుగుల కారణంగానే చంద్రబాబుకు లభించిన విజయం.
ఇక, తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా.. ఇదే పంథాలో పయనిస్తారని అందరూ అనుకున్నారు. ఆశలు కూడా పెట్టుకున్నారు. తన తప్పులు తెలుసు కుంటారని ఆశించారు., వాటిని సరిదిద్దుకుని అడుగులు వేస్తూ..పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ముందుకు సాగుతారని కూడా కొందరు అంచనా వేసుకున్నారు. నిజానికి రాజకీయాల్లో పార్టీలు.. నాయకులు కూడా.. తమ తప్పులు తెలుసుకుని ముందుకు సాగడం.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం.
కానీ, జగన్ ఆదిశగా ఎక్కడా అడుగులు వేసినట్టు కనిపించడం లేదు. తాజాగా ఆయన తన పార్టీకి చెందిన ఎంఎల్‌సీలతో భేటీ అయ్యారు. సంఖ్యా బలం అసెంబ్లీలో లేకపోయినా.. శాసన మండలిలో ఉందని.. కాబట్టి ఇక్కడ గట్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో తాము చేసింది మంచేనని ఆయన చెప్పుకొచ్చారు. ఐదేళ్లు తమ పాలన అద్భుత మని చెప్పుకొచ్చారు. ప్రజలు ఇప్పటికీ తననే విశ్వసిస్తున్నారని కూడా చెప్పారు. కానీ, క్షేత్రస్థాయిలో వైసీపీ కంచుకోటలు కదిలిపోయాయన్న విషయం తెలిసి కూడా.. ఇలా వ్యాఖ్యానించడం చూస్తే.. జగన్ తెంపరి తనం ఏంటో అర్ధమవుతుంది.
ఓటమి తర్వాత ఎంత పెద్ద పార్టీ అయినా.. ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంది. కానీ, జగన్ లో మాత్రం మార్పు… ఆత్మ పరిశీలన.. తప్పులు వెతికి పట్టుకోవడం వంటివి ఎక్కడా కనిపించకపోగా.. తన పాలనకు తను మరోసారి మార్కులు వేసుకున్నారు.
ఇది పార్టీ అధినేతగా ఆయనకు బాగానే ఉందేమో.. కానీ.. ప్రజాస్వామ్యంలో ఒకసారి ప్రజలు ఇంతగా దూరం పెట్టాక.. మాత్రం మరోసారి అదే బాట బాగుందని చెప్పడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా జగన్ తనను తాను సరిచేసుకోవాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 14, 2024 10:32 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…