ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేయగా.. అనంతరం.. మంత్రులతో భేటీ అయి.. భవిష్యత్తుపై వారితో చర్చించారు. అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత.. గురువారం సాయంత్రం నాటికి విజయవాడకు తిరిగి వచ్చారు. ఇక్కడి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం.. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
సాయంత్రం 4 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు సరిగ్గా పండితులు నిర్ణ యించిన ముహూర్తం 4.41 గంటలకు తన సీటులో ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం.. చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు.. ఐదు కీలక అంశాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఓ మంత్రి చంద్రబాబుకు బంగారు కలం బహుమతిగా అందించారు. దీంతోనే చంద్రబాబు సంతకాలు చేయడం గమనార్హం.
ఇవీ.. చంద్రబాబు సంతకాలు..
1. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.
2. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం
3. పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం
4. స్కిల్ సెన్సెస్ పై నాలుగో సంతకం.
5. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం
అమరావతిలో పూల పాన్పు!
ముఖ్యమంత్రి చంద్రబాబు.. సెక్రటేరియెట్‌కు వెళ్తున్న క్రమంలో అమరావతిలోని రాజధాని ప్రాంత రైతులు.. ఆయనకు పూల పాన్పు పరిచారు. రోడ్లపై దారి పొడవునా పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు వచ్చారు. అందరికీ ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వచ్చారు.
This post was last modified on June 14, 2024 10:25 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…