ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఈ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాలలో విజయం సాధించింది. వైసీపీ ఎర్రగొండపాలెం, దర్శి స్థానాలకు పరిమితం అయింది. గత ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది, టీడీపీ నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అద్దంకి నుండి గెలిచిన గొట్టిపాటి రవికుమార్, కొండపి నుండి గెలిచిన డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామిలకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది.
2004 లో మార్టూరు నుండి, 2009లో అద్దంకి నుండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్, 2014లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీ నుండి తీవ్ర వత్తిడి, వేధింపులు ఎదుర్కొన్నాడు. ఆయనకు చెందిన 11 గ్రానైట్ క్వారీలు, రెండు పరిశ్రమలను జగన్ ప్రభుత్వం మూసివేయించింది.
ఒత్తిళ్లను తట్టుకోలేక కరణం బలరాం, శిద్దా రాఘవరావులు పార్టీకి గుడ్‌బై చెప్పినా రవికుమార్ మాత్రం టీడీపీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చిన హనిమిరెడ్డి మీద 24 వేల ఓట్లతో గెలుపొందారు.
ప్రభుత్వ డాక్టర్ అయిన కొండపి ఎమ్మెల్యే డా.డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి దామచర్ల కుటుంబ సహకారంతో రాజకీయాల్లోకి ప్రవేశించి 2014, 2019 ఎన్నికల్లో వరసగా విజయం సాదించాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ మీద 24,756 ఓట్లతో హ్యాట్రిక్ విజయం సాధించారు.
వివాదరహితుడిగా పేరున్న స్వామి వైసీపీ ప్రభుత్వంలో వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అసెంబ్లీలో అధికారపక్షం దాడిచేసిన, నియోజకవర్గంలో ఇంటి మీద దాడులు చేసినా వెరవకుండా పార్టీలోనే కొనసాగారు. దీంతో ఆయన నిబద్దతకు బహుమతిగా చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
This post was last modified on June 13, 2024 11:13 am
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…
బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న…
ధనుష్, నాగార్జున కలయికతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు కొలిక్కి వస్తున్నాయి. ఎడిటింగ్…
ఇంకో వారం రోజుల్లో నాని కొత్త చిత్రం ‘హిట్-3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సినిమా రిలీజ్కు రెడీ చేసేలోపే ఇంకో…
టీడీపీ నిర్వహించ తలపెట్టిన మహానాడు ఈ దఫా పంబరేగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. పోయి పోయి.. వైసీపీ అధినేత జగన్…
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న…