ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను…’’ అని చంద్రబాబు అనగానే సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. చంద్రబాబు నాలుగో సారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే.
అనంతరం, చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబును ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని మీ వెనుక నేనున్నాను అని చంద్రబాబు వెన్ను తట్టారు. చంద్రబాబుతోపాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు దక్కాయన్న విషయంపై ఈ రోజు రాత్రి లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ నేత ఈటల రాజేందర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి రమ్య, మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్, దర్శకుడు క్రిష్, హీరో నిఖిల్, మెగా కుటుంబ సభ్యులు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
This post was last modified on June 12, 2024 11:57 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…