చంద్రబాబు కేబినెట్‌లో ఎస్సీ కోటాలో మంత్రి పీఠం దక్కించుకున్న వంగలపూడి అనిత. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న అనితకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలోనే ఇవ్వాలని అను కున్నా.. కుదరలేదు. ఇక, గత ఐదేళ్లలో అనిత పార్టీపరంగా దూకుడు ప్రదర్శించారు. వైసీపీ సర్కారుపై నేరుగా నే కాకుండా.. న్యాయ పోరాటాలతోనూ ఆమె విజృంభించారు. దీనికితోడు బలమైన వాయిస్ కూడా వినిపించారు. ఈ పరిణామాలు ఆమెకు కలిసివచ్చాయి.
కాగా, గతంలో 2012 వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత 2013లో రాజకీయ అరంగే ట్రం చేశారు. తొలిసారి పాయకరావు పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పుడే ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ, అవకాశం చిక్కలేదు కొంత నిరాశకు గురైనా.. ఆమె పార్టీ తరఫున ప్రచారం చేయడం లోనూ.. సర్కారుకు దన్నుగా ఉండడంలో కీలక రోల్ పోషించారు.
అయితే పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆమె అసెంబ్లీలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నారు. ఆమె తన బలమైన వాయిస్‌ను వినిపించారు. అయితే 2019లో నియోజకవర్గం మార్పు చేశారు. దీంతో కొవ్వూరు నుంచి అనిత పోటీ చేశారు. అయితే.. అప్పట్లో ఆమె ఓడిపోయారు. అనితపై మాజీ హోం మంత్రి తానేటి వనిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓడినా కూడా.. తన పంథాను ముందుకు సాగించారు. దీనికి తోడు చంద్రబాబు తెలుగు మహిళ రాష్ట్ర చీఫ్ పదవికి ఆమెను ఎంపిక చేశారు.
అనంతరం.. ఆమె తన పాత నియజకవర్గం పాయకరావు పేటకు వెళ్లిపోయారు. తాజా ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్నారు. మొత్తంగా గతంలో టీచర్ వృత్తిని వదిలి.. బయటకు వచ్చిన అనిత ఇప్పుడు పదేళ్ల తర్వాత.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
This post was last modified on June 12, 2024 12:04 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…