ఒక నాయకుడిని ప్రజలు నమ్మితే ఏం చేస్తారు? ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటారు…ఆయన పాలన కావాలని అనుక్షణం పరితపిస్తుంటారు…ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురుచూస్తుంటారు…ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే రోజు కోసం పరితపిస్తుంటారు…వారు కలలుగన్న క్షణం నిజమైన వేళ వారి ఆనందానికి అవధులుండవు..తమ అభిమాన, ఆరాధ్య నాయకుడు కళ్ల ముందు కనిపిస్తే వారి పరుగుకు పట్టపగ్గాలుండవు..
తన అభిమాన నాయకుడు, విజనరీ లీడర్, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించగానే ఓ మహిళ ఆయన కాన్వాయ్ వెంట మండుటెండలో పరుగులు పెట్టింది…సార్ సార్ అంటూ…పట్టు వదలకుండా ఆయన కారు వెంబడి పరుగెట్టింది…ఆమెను చూసిన చంద్రబాబు కాన్వాయ్ ను ఆపి మరీ ఆమెను పలకరించారు.
భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా..చంద్రబాబు వారిని సున్నితంగా వారించి ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయవాడలో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాకుండా సామాన్య ప్రజలకు కూడా దారి పొడవునా చంద్రన్నకు ఘన స్వాగతం పలికారు.
ఈ క్రమంలోనే సమావేశం ముగించుకొని ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగు తీసింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు.
పరిగెత్తడం వల్ల గస పెడుతున్న ఆ మహిళను నెమ్మదించమని సూచించిన చంద్రబాబు…ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని, చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని ఎమోషనల్ గా చెప్పింది. చంద్రబాబు గెలుపు కోసం తాను చాలా కష్టపడ్డానని, తమ కష్టం ఫలించి తమ కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్ అంటూ భావోద్వేగానికి లోనైంది.
ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ కోరింది. అయితే, చంద్రబాబు సున్నితంగా వద్దని వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా మిమ్మల్ని చూడాలన్న తపనతో వచ్చాను అని నందిని చెప్పింది.
ముందు ఆసుపత్రికి వెళ్లు అని నందినికి చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని…. అవసరమైన వైద్యం, సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on June 11, 2024 7:06 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…