ఇంతకాలానికి మన సైన్యాలు తూర్పు లడ్డాఖ్ లో పై చేయి సాధించింది. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయిన కారణంగా మన భూభాగంలోని చాలా ప్రాంతాలను డ్రాగన్ దేశం ఆక్రమించేసింది. అప్పటి నుండి ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఒక్క ఇంచుకూడా వెనక్కు జరగటానికి చైనా అంగీకరించలేదు. దాంతో మన సైన్యాలు కూడా ఆ భూభాగంపై ఆశలు వదిలేసుకుంది. అయితే హఠాత్తుగా గడచిన కొన్ని నెలలుగా సరిహద్దుల్లో మారిన పరిణామాల నేపధ్యంలో సరిహద్దులోని చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో కొంత భాగాన్ని మళ్ళీ మన సైన్యాలు చేజిక్కించుకున్నాయి. ప్రధానంగా తూర్పు లడ్డాఖ్ లోని చాల ప్రాంతాలు దశాబ్దాల తర్వాత మళ్ళీ మన వశం అయ్యాయి.
గడచిన మూడు వారాల్లో లడ్డాఖ్ ప్రాంతంలో ఉన్న 20 పర్వత ప్రాంతాలపై మన సైన్యాలు స్పష్టమైన పట్టుసాధించాయి. ఇందులో ఫింగర్స్ అని పిలుస్తున్న 8 పర్వతాలు చాలా కీలకమైనవి. ఈ ఫింగర్స్ పర్వతాలపైనే డ్రాగన్ తన సైన్యాలను మోహరించి భారత్ సైన్యం కదలికలను జాగ్రత్తగా గమనిస్తు చికాకులు కలిగిస్తోంది. చాలా ఎత్తుగా ఉండే ఈ ఎనిమిది పర్వతాలపైన మోహరించిన చైనా సైన్యం మన దేశ సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు గమనించగలుగుతున్నాయి. దాని వల్ల మన సైన్యానికి సంవత్సరాల తరబడి అపరామైన నష్టం జరుగుతోంది.
గాల్వాన్ లోయలో మన సైన్యంపై చైనా సైన్యం దాడులు జరపటం, 20 మంది చనిపోయిన ఘటన తర్వాత నుండి మన సైన్యం కూడా డ్రాగన్ సైన్యంపై ఎదురుదాడులకు దిగింది. అప్పటి వరకు కేవలం ఆత్మరక్షణకు మాత్రమే పరిమితమైన మనసైన్యాలు ఒక్కసారిగా ఎదురుదాడులు మొదలుపెట్టడంతోచైనా సైన్యాలు తట్టుకోలేకపోతున్నాయి. దాంతో మన సైన్యాలు రెచ్చిపోయి చైనా బలగాలను మెల్లమెల్లగా కబ్జా చేసిన మన భూభాగం నుండి తరిమేయటం మొదలుపెట్టాయి. ఈ నేపధ్యంలోనే చైనా సైన్యం వందల చదరపు కిలీమీటర్ల వెనక్కు వెళ్ళిపోయినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇందులో భాగంగా దశాబ్దాల పాటు తమ ఆధీనంలోనే ఉంచుకున్న 20 పర్వత ప్రాంతాలనుండి డ్రాగన్ సైన్యం వెనక్కు వెళ్ళిపోవాల్సొచ్చింది. దాంతో మన సైన్యం వెంటనే యుద్ధ ట్యాంకులను, యుద్ధ విమానాలను, క్షిపణి ప్రయోగాల లాంచిగ్ ప్యాడ్లను, హెలికాప్టర్లు దిగేందుకు అవసరమైన బేస్ లను ఏర్పాటు చేసేసుకుంది. అంటే ఏ మూలనుండి చైనా ఆక్రమణకు దిగినా వెంటనే మనకు తెలిసిపోతోంది. తన చేతిలో నుండి కీలకమైన పర్వత ప్రాంతాలు చేజారిపోయాయన్న ఉక్రోషంతోనే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుండి డ్రాగన్ సైన్యాలను తరిమేయటం మన సైన్యానికి ఓ లెక్కా. కాకపోతే కాస్త సమయం పడుతుందంతే.
This post was last modified on September 23, 2020 12:24 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…