ఆంధ్రప్రదేశ్ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకునే కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మధ్య ఎంతటి భావోద్వేగ అనుబంధం ఉందన్న విషయం అనూహ్యంగా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కటమే కాదు.. బాబు – పవన్ మధ్య ఉన్న బలమైన బంధం ఆవిష్క్రతమైంది. అసలేం జరిగిందంటే..
ఏపీ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును కూటమి తరఫున తాను ప్రతిపాదిస్తున్నట్లుగా పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ వెంటనే ఆ ప్రతిపాదనకు ఏకగీవ్రంగా ఆమోదం పలికారు. అనంతరం ఆనందంతో చంద్రబాబు పవన్ వద్దకు వచ్చారు. పవన్ ను చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఒకొరికొకరు అప్యాయంగా దగ్గరకు తీసుకున్న వైనం అందరిని ఆకర్షించింది.
అనంతరం తిరిగి వెళుతున్న చంద్రబాబు చేతిని పట్టుకున్న పవన్ కల్యాణ్.. మైకు వద్దకు తీసుకెళ్లి.. “ఇది నేను ఆయన్ను పక్కన పెట్టుకొనే చెప్పాలి.. “ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన్ను. భువనేశ్వరి కన్నీళ్లుపెట్టుకుంటే చెప్పాను.. అమ్మా కన్నీళ్లు పెట్టుకోవద్దు. మంచిరోజులు వస్తాయని చెప్పాను. మంచి రోజులు వచ్చాయి. ఆయనకు మనస్ఫూర్తిగా (నొక్కి చెబుతూ) వారికి నా హ్రదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికి. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను” అని పవన్ చెప్పగా.. భావోద్వేగానికి గురైన చంద్రబాబు తలను అంగీకారంగా ఊపారు. ఈ సందర్భంగా తన తలను కాస్త ముందుకు వంచి పవన్ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించి వెనుదిరిగారు. ఈ అనూహ్య సీన్ కూటమి నేతల మధ్య మరింత బలమైన భావోద్వేగ బంధానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమన్నట్లు కాకుండా.. అసలుసిసలు కూటమి బంధంగా ఈ వైనం కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 11, 2024 12:42 pm
సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…
సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…
ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…
ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…
దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…