వైసీపీలో నాయకుల ఫైరింగ్ పెరుగుతోంది. అధినేత జగన్ కేంద్రంగా నాయకులు నిప్పులు చెరుగుతు న్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణం.. జగన్ వైఖరేనని నాయకులు చెబుతున్నారు. కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం తన అనుచరుల దగ్గర విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వైసీపీ కీలక నాయకుడు కొక్కిలిగడ్డ రక్షణ నిధి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఈ సారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పైగా.. టీడీపీ నుంచి తీసుకున్న నల్లగట్ల స్వామిదాసుకు జగన్ ఇక్కడి టికెట్‌ను ఇచ్చారు. అయినప్పటికీ.. ఇక్కడ వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి జగనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్టానికి చేసింది శున్యం అని పరుషంగానే వ్యాఖ్యానించారు.
జగన్ కారణంగానే 2019-24 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తిరువూరు నియోజక వర్గ అభివృద్ధి చేయలేకపోయానని రక్షణ నిధి చెప్పారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడు.. రహదారుల దుస్థితిని వివరించానని.. అయినా పట్టించుకోలేదన్నారు. తిరువూరు వచ్చి జగన్ ఇచ్చిన హామీలు నీట మునిగాయన్నారు. 2023 డిసెంబర్ నుంచి వైసిపికి దూరంగా వున్నానన్నారు. ఐ ప్యాక్, సలహదారులను నమ్మి నట్టేట మునిగావు జగన్ అని అన్నారు.
“ప్రజల మధ్య తిరిగింది మేము. కనీసం మమ్మల్ని అడిగావా జగన్. నీ వల్ల రాష్టానికి ఒరిగింది ఏమి లేదు. కనీసం ఎప్పుడైనా ఎమ్మెల్యే లను గుర్తించావా జగన్. ఏ సమస్య చెప్పినా.. అధికారులకు చెప్పేవాడు. కానీ, వాళ్లు మమ్మల్ని పురుగుల మాదిరిగా తీసేశారు. 60 మంది సలహాదారులు ఈయనకు ఏం చెప్పారో.. ఈయన వారికి ఏం ఇచ్చారో.. మొత్తానికి పార్టీని బుట్టదాఖలు చేశారు” అని రక్షణ నిధి వ్యాఖ్యానించారు. గెలుచిన ఎమ్మెల్యే అభ్యర్ది కొలికపూడి. శ్రీనివాసరావు, ఎంపీ. అభ్యర్ది కేశినేని. శివ నాథ్ కు, కూటమి పార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
This post was last modified on June 10, 2024 6:23 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల్లో ఏది ముందు రిలీజనే అయోమయం కొద్దిరోజులుగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిం దే. మంగళవారం ఢిల్లీకి…
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, మెస్మరైజింగ్ లుక్స్ తో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ నభా నటేష్. కన్నడ…
సాధారణంగా సినిమా నిడివి రెండున్నర నుంచి మూడు గంటల మధ్యలో ఉండటం ఎప్పటి నుంచో చూస్తున్నదే. ప్రేక్షకులు దీనికే అలవాటు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇది ఆయనకు అధికారం లోకి వచ్చిన తర్వాత…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సోదరుడు, పార్టీ కోసం కృషి చేస్తున్న నాగబాబు…