కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడో సారి వరుసగా అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. భగవంతుడి సాక్షిగా తాను భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఎటువంటి రాగద్వేషాలకు, పక్షపాతానికి లోను కాకుండా అంత:కరణ శుద్ధితో తన బాధ్యతలు నిర్వహిస్తానని మోదీ హిందీలో ప్రమాణం చేశారు. మోదీతో పాటు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివ రాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోకలిపి మొత్తం 68 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. మోదీ మంత్రివర్గంలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మలకు చోటు దక్కగా..తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు చోటు దక్కింది.
ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. భూటాన్ పీఎం షేరింగ్ తోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
This post was last modified on June 10, 2024 7:02 am
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…