ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు.. శనివారం తెల్లవారు జామున అస్తమించిన విషయం తెలి సిందే. దాదాపు 24 గంటలకు పైగానే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. అనంతరం ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అంత్యక్రియల ఘట్టం ప్రారంభమైంది. అంతిమ ఘట్టంలో టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ రుణం తీర్చుకున్నారు.
రామోజీ రావు పాడెను మోసిన చంద్రబాబు.. తుది ఘట్టంలోనూ.. ఆయన భౌతిక దేహాన్ని పట్టుకుని అం త్యక్రియల వేదికపైకి చేర్చారు. దీంతో 1994 నుంచి చంద్రబాబుతో ఉన్న రామోజీ బంధానికి ముగింపు పలికినట్టయింది. అయితే.. రామోజీ కుటుంబంతో బాబు సంబంధాలు కొనసాగుతాయి. కానీ, ఆ రేంజ్‌లో ఇకపై ఉండకపోవచ్చు. ఇదిలావుంటే,రామోజీ భౌతిక దేహాన్ని సందర్శించేందుకు శనివారం ఫిల్మ్ సిటీకి వెళ్లిన చంద్రబాబు ఆ రోజు రోజంతా కూడా.. అక్కడే ఉన్నారు.
అంత్యక్రియల ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతోపాటు.. ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి చూసుకో వడం మరో విశేషం. గతంలో అన్నగారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ మృతి చెందినప్పుడు కూడా.. బాబు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఆయన పాడె కూడా మోశారు. ఇప్పుడు రామోజీరావు కడ క్రియల్లోనూ చంద్రబాబు తన పాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబుకు ఊపిరి సలపనంత పని ఉంది. అయినప్పటికీ.. తనను రాజకీయంగా ఆదుకున్న మీడియా మొఘల్‌కు నివాళులర్పించడంలో చంద్రబాబు అడుగు వెనక్కి వేయకపోవడం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలు సమర్పించింది. పోలీసుల గౌరవ వందనం అనంతరం.. రామోజీ చితికి ఆయన పెద్దకుమారుడు నిప్పంటించారు.
This post was last modified on June 9, 2024 4:11 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…