మనిషి సైకాలజీని తెలుసుకునేందుకు.. ఇప్పటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఈ సైకాలజీని రామోజీరావు.. ఎప్పుడో జీర్ణించుకున్నారు. మానవ మాత్రులు ఎవరైనా కూడా.. నిత్యనూతనత్వాన్ని కోరుకుంటారనేది ఆయనచెప్పే మాట. అందుకే.. ఆయన తన సంస్థలు.. తన విధానాల్లోనూ.. నిత్య నూతనత్వానికి పెద్ద పీట వేశారు. అది ఈనాడు సంస్థలైనా.. రామోజీ ఫిల్మ్ సిటీ అయినా.. ప్రతి విషయంలోనూ వినూత్నతకు పెద్ద పీట వేశారు.
ఈనాడు కార్యాలయాల విషయానికి వస్తే.. ప్రతి ఆరు మాసాలకు.. ప్రత్యేకత కనిపిస్తుంది. ఉన్నవి ఉన్నచోటే ఉండవు. అవి వేరే ప్రాంతానికి మారుతుంటాయి. ఉన్నది ఒక్క గదే.. అయినా.. నేడు ఉన్నట్టుగా రేపు ఆరు మాసాల తర్వాత.. వాటిలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి మూడేళ్లకు ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఇవన్నీ.. సైకాలజీని అనుసరించే చేస్తారు. చేసిన చోటే చేయడం.. కూర్చున్న చోటే కూర్చోవడం వంటి వాటితో నైపుణ్యాలు పెరగవని విశ్వసిస్తారు.
రామోజీఫిల్మ్ సిటీలో అయితే.. ఈ మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి ప్రాంతంలోనూ వినూ త్నత కనిపిస్తుంది. నిన్న ఉన్నట్టుగా.. ఆరు మాసాలత ర్వాత.. ఉండదు. గదులు మారతాయి.. వాతావరణం కూడా.. మారుతుంది. తద్వారా.. ఉద్యోగుల పనితీరులోనూ మార్పులు వచ్చేలా చేస్తాయన్నది రామోజీ అవలంభించిన సైకాలజీ విధానం. ఇది ఈనాడును, రామోజీ ఫిల్మ్ సిటీని.. కూడా నిత్యం నూతనంగా ఉంచాయి.
ఓ సందర్భంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లాను.. ఇప్పుడు కూడా వెళ్లాను. కానీ.. అప్పటికీ.. ఇప్పటికీ.. చాలా తేడా కనిపించింది. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్లినట్టుగా ఉంది. ఈ మార్పులు ప్రభుత్వంలోనూ రావాలి అని అన్నారు. ఇలా.. నిత్య నూతనత్వానికి పెద్దపీట వేసిన రామోజీరావు.. ఆసాంతం ఉద్యోగులను కూడా అదే బాటలో నడిపించారు.
This post was last modified on June 8, 2024 5:36 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…