ఎవరైనా బోలెడు పిండి వంటలు, నోరూరించే పదార్థాలతో పెద్ద పళ్లెంలో మంచి ఆకలి మీదున్నప్పుడు వడ్డించారనుకోండి. ఎలా ఫీలవుతాం. ఆవురావురమంటూ తినేస్తాం. తర్వాత భుక్తాయాసంతో ఆమ్మో అయ్యో అంటూ ఈనో లేదా సోడానో తాగేందుకు పరిగెడతాం.
పవన్ కళ్యాణ్ అభిమానుల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రోజుకో ఎలివేషన్ వీడియో, ఫోటోలతో ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నావదినతో పాటు తల్లి ఆశీర్వాదం తీసుకున్న క్లిప్స్ తో సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోయింది.
ఇది ఇంకా కళ్ళముందు ఉండగానే ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, కీలక నేతల ముందు పవన్ కళ్యాణ్ ని తుఫానుగా వర్ణించిన వీడియో ఓ రేంజ్ లో పేలింది.
ఒకప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పిన రోజు నుంచి ఏకంగా పార్లమెంట్ లో మోడీకి మద్దతు తెలిపే స్థాయికి చేరుకోవడం చూసిన ఫ్యాన్స్ కి అంతకన్నా సంబరం ఇంకేముంటుంది. గతంలో నోరు పారేసుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు క్షమాపణ కోరుతున్న వైనం మాములు వైరల్ కాలేదు. ఇలాంటివి క్రమం తప్పకుండ వస్తున్నాయి.
ఇదంతా చూస్తూ పవన్ ఫ్యాన్స్ వేరే పనులు చేసుకోలేక వీటినే చూసుకుంటూ ఉన్నామంటూ వాపోతున్నారు. జనసేన గెలుపుకన్నా ముందు గత ఎన్నికల ఓటమి గురించి గెలిచేస్తున్న వాళ్లకు సమాధానం చెప్పే స్టేజి నుంచి ఇప్పుడు ఇది మా పవన్ రేంజ్ అంటూ సజీవ సాక్ష్యాలతో బదులు ఇచ్చే రేంజుకి రావడం చూసి వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు.
ఇంకా ప్రమాణస్వీకారం, పొలిటికల్ మీటింగులు, గెస్టుగా ఈవెంట్లకు వెళ్లడం,వీరమల్లు షూటింగ్ విశేషాలు అబ్బో రాబోయే రోజులు నిజంగానే అప్డేట్లతోనే ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమే. ఇదంతా కెజిఎఫ్ రేంజ్ ఎలివేషనని జనాలు అనుకోవడంలో తప్పేమీ లేదు.
This post was last modified on June 7, 2024 8:27 pm
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…