తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి పార్టీల సమావేశంలో తదుపరి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను అందరూ ఏకగ్రీవంగా అంగీకరించా రు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. మాట్లాడారు. ఆయన పార్టీకి.. ఏపీలో రెండు ఎంపీ స్థానాలు దక్కాయి. రెండు చోట్ల పోటీ చేసి రెండు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు కూడా.. ఎన్డీయేలో కీలక పాత్ర లభించింది.
ఇక, పవన్ మాట్లాడుతూ.. 2014లోనే చంద్రబాబు తనకు ఓ మాట చెప్పారని.. వచ్చే 15 సంవత్సరాలు.. ఈ దేశానికి ప్రదానిగా మోడీనే ఉంటారని అన్నారని తెలిపారు. అంతేకాదు.. మోడీ విజన్‌తో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ విషయా న్ని కూడా చంద్రబాబు అప్పట్లోనే అంచనా వేశారని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఎన్డీయే మిత్ర పక్షా లు హర్షం వ్యక్తం చేస్తూ.. బల్లలు చరుస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తీకరించాయి.
ఈ సమయంలో చంద్రబాబు.. మోడీలు సంతోషంలో మునిగిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు అన్న మాటలను పవన్ గుర్తు చేసిన సమయంలో చంద్రబాబు కూడా.. మోడీ చెవిలో.. ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో మోడీ మరింత మురిసిపోయారు. చంద్రబాబు చేతిలో చేయి వేసి..మరీ అభినందన పూర్వకంగా నవ్వులుకురిపించారు. మీడియాలో వీరి ఆనంద క్షణాలను ప్రముఖంగా ప్రసారం చేయడం గమనార్హం.
This post was last modified on June 7, 2024 3:26 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…