ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. మరో నాలుగు రోజుల్లో ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. గత జగన్ పాలనలో జరిగిన అవినీతి.. తీసుకున్న నిర్ణయాలపై.. కూటమి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే.. యాక్షన్ ప్రారంభ మైంది. ఈ క్రమంలో ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. ప్రధానంగా లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
ఈ క్రమంలో జగన్ హయాంలో ఏపీ బేవరేజస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదా లు ప్రారంభమయ్యాయి. జగన్ పాలనా కాలంలో మద్యం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎక్క డా లేనివిధంగా చీపు లిక్కర్ ను ఇక్కడ విక్రయించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం కంటికి కనిపించకుండా చేశారు. దీనికితోడు రూ.60 ఉన్న మద్యం బాటిల్‌ను రూ.200లకు అమ్మారు. దీనివెనుక పెద్ద ఎత్తున ఏదో మాఫియా ఉందనే చర్చ అప్పట్లోనే జరిగింది.
పలు మార్లు చంద్రబాబు కూడా.. లిక్కర్ కుంభకోణంపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే.. లిక్కర్ మాఫియా అంతు చూస్తామని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలోనే తొలి అడుగు ఇప్పుడు పడినట్టు కనిపిస్తోంది. జగన్ హయాంలో ఏపీ బేవరేజస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నానక్‍రామ్‍గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నట్టు సమాచారం.
జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని వాసుదేవ రెడ్డిపై ఆరోపణలు ఉ న్నాయి. అధికార వైసీపీకి, ముఖ్యంగా జగన్‌కు కూడా.. ఆయన కరడుగట్టిన మద్దతుదారుగా వ్యవహరించా రని టీడీపీ నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే. మద్యం రాబడి.. పాలసీ సహా అన్ని విషయా లు ఈయన కనుసన్నల్లోనే జరిగాయని అంటారు. అందుకే.. ముందుగా ఈయనను విచారిస్తున్నట్టు సమా చారం. అనంతరం.. అసలు వ్యక్తులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది.
This post was last modified on June 7, 2024 1:34 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…