‘బీజేపీ గాలి ఉందని మీరు చెబుతున్నారు. ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అని ప్రకటించిన మాజీ ఐఎఎస్ అధికారి వీకె పాండియన్ ఎక్కడ ? అన్న ప్రశ్న వినిపిస్తుంది. గత రెండు రోజులుగా ఆయన కనిపించకపోవడంై ఒడిశాలో ప్రధానంగా చర్చ నడుస్తున్నది.
తమిళనాడుకు చెందిన పాండియన్ 2019 ఎన్నికల నుండి ముఖ్యమంత్రి నవీన్ కు నమ్మకమైన అధికారిగా మెలిగాడు. ప్రభుత్వ నిర్ణయాలలో కీలకపాత్ర పోషించిన ఆయన సూపర్ సీఎం అని పేరుపడ్డాడు. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి బీజేడీలో చేరాడు. ఈ ఎన్నికల్లో తమిళ వ్యక్తి ఒడిశాలో పెత్తనం ఏంటని ప్రధానంగా బీజేపీ ప్రచారం కూడా చేసింది.
మరోసారి ముఖ్యమంత్రి అయి నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టిస్తారు అనుకున్నారు. కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ 21 లోక్ సభ స్థానాలలో బీజేడీకి ఒక్కటి కూడా దక్కలేదు. 20 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 147 శాసనసభ స్థానాలలో బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, సీపీఎం 1, స్వతంత్రులు 3 స్థానాలలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాండియన్ అదృశ్యాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? అన్న వాదన వినిపిస్తుంది.
This post was last modified on June 7, 2024 12:19 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…