ఆలోచన మంచిదే. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాకే ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే ధోరణి కూడా మంచిదే. అయితే, ఈ ఆలోచనలకు ఎంత సమయం కావాలి? ఎన్నాళ్లు పట్టాలి? అనేదే కీలకం. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను.. అనే ధోరణిని నేటి రాజకీయ నేతలు జీర్ణించుకోలేరు. ఫటా ఫట్-ధనా ధన్ అనుకున్నది అయిపోవాలి. మంచో చెడో నిర్ణయం తీసేసుకోవాలి. ఇదే ప్రస్తుత నేతలు ఆశిస్తోంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ ధోరణిని ఇప్పటికీ అవలంబించలేక పోతున్నారు. ఆయన ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకోవాలంటే.. నాన్చుతారనే విమర్శలను మూటగట్టుకున్నారు.
ఈ నాన్చుడు ధోరణే పార్టీని ముంచుతోందని తమ్ముళ్లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. నాయకులను ఒక పట్టాన నమ్మరనే వ్యాఖ్యలు చంద్రబాబు గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే, ఈ నమ్మకం అనేది లేకపోతే.. రాజకీయాలే లేవు. కానీ, బాబు మాత్రం మారడం లేదు. గత ఏడాది ఎన్నికల సమయంలో దాదాపు 50 నియోజకవర్గాల్లో నేతలను నిర్ణయించడానికి బాబు ఇదే నాన్చుడు ధోరణిని అవలంబించారు. చివరాఖరుకు తేల్చినా.. అది అసంతృప్తులకు దారితీసింది. ఫలితంగా పార్టీ ఘోర పరాజయానికి దారితీసింది.
బాపట్ల, తిరువూరు, నిడవోలు, కొవ్వూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు ఎంపీ టికెట్.. విజయవాడ పశ్చిమ.. గుంటూరు తూర్పు, నరసరావు పేట ఎంపీ స్థానం ఇలా దాదాపు 50 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాన్చుడు ధోరణిని ప్రదర్శించారు. పలితంగా అక్కడ గ్రూపు రాజకీయాలు ఏర్పడి.. పార్టీ పరుగులకు బ్రేకులు పడ్డాయి. సరే! అయిందేదో అయిపోయింది. మరి ఇప్పటికైనా బాబు.. పార్టీని ముందుకు నడిపించడంలో దూకుడుగా ఉన్నారా? స్పాట్ డెసిషన్ తీసుకుంటున్నారా? అంటే.. లేదనే అంటున్నారు తమ్ముళ్లు.
ప్రస్తుతం పార్టీకి యువ నేతలు చాలా అవసరం. జెండా మోయడం దగ్గర నుంచి పార్టీ విధానాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మరీ ముఖ్యంగా యువ నేత లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయడంలోనూ యువ నాయకత్వం చాలా ముఖ్యం. ఈ విషయంలో చంద్రబాబు కూడా తాను యువతకే పెద్దపీట వేస్తానని ఎన్నికలు ముగిసిన నాలుగు మాసాల్లోనే సంకల్పం చెప్పుకొన్నారు. అంతేకాదు, పార్టీ పదవుల్లో 33 శాతం యువతకే ఇస్తానని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ యువత బాబు తమకేదో చేస్తారని ఆశలు పెట్టుకున్నారు.
కానీ, ఇప్పటికీ చంద్రబాబు దీనిపై సాచివేత ధోరణినే అవలంభిస్తుండడం గమనార్హం. దీంతో ఎక్కడికక్కడ యువ నేతలు వైసీపీ బాట పడుతున్నారు. ఈ పరిణామాలను కోట్ చేస్తున్న సీనియర్ నేతలు.. నాన్చుడు ధోరణే.. మాకు శాపంగా మారిందని అంటున్నారు. మరి బాబు తన శైలిని మార్చుకుని.. తక్షణ నిర్ణయాలు తీసుకుంటారా? లేక ఇలానే ఉంటారో.. చూడాలి.
This post was last modified on September 20, 2020 12:17 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…