Political News

బోరుమంటున్న బెట్టింగ్ బంగార్రాజులు !

ఏపీలో టైట్ ఫైట్ ఉంటుంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్మిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఫలితాలు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బోరుమంటున్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఎన్నికల ఫలితాలపై పందాలు కాశారు. ఈ సారి ఎన్నికల మీద వందల కోట్ల బెట్టింగులు జరిగాయని చెబుతున్నారు.

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేశ్‌ (30) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 లక్షల వరకూ పందెం కాశాడు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన కొందరు చేనేత కార్మికులు కలిసి వైసీపీ గెలుస్తుందని రూ.5 లక్షలు పందెం కాశారు. వైసీపీ ఓటమితో డబ్బులు పోయి వారు బోరుమంటున్నారు.

గుంటూరులో రూ.50 లక్షలు పందె కాసిన ఓ వ్యక్తి ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిన పల్నాడులోనూ పందెంరాయుళ్లు ఏం తక్కువ తినలేదు. పల్నాడు జిల్లా రొంపిచర్ల చెరువు కట్ట సెంటర్‌లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసుకుని టీడీపీ, వైసీపీ అభిమానులు అతని వద్ద సుమారు రూ.1.50 కోట్ల మేర నగదును పెట్టారు. ఫలితాల తర్వాత డబ్బుల కోసం అతని ఇంటికి వెళ్లగా అతను అప్పటికే ఊర్లో నుండి ఉడాయించినట్లు తెలుస్తుంది.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరులో చంద్రబాబు సీఎం అవుతారని ఓ వైసీపీ నేతతో పందె కాసి రూ.50 లక్షలు అతని వద్ద పెట్టారు. గెలిచిన వారికి డబ్బులు ఇచ్చేలా కాగితం కూడా రాసుకున్నారు. తీరా ఫలితాల తర్వాత వెళితే అతడు ఊరు విడిచి పారిపోయాడు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి తర్వాత ఏపీలో జోరుగా పందాలు కాసినట్లు తెలుస్తుంది.

This post was last modified on June 6, 2024 10:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విడుదల పార్ట్ 3 క్లారిటీ ఇచ్చేశారు!

విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…

1 hour ago

ఏఐ టెక్నాలజీతో గంటలో స్వామి వారి దర్శనం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు‌. అయితే, రద్దీ కారణంగా…

1 hour ago

కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట!

ఫ్ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.…

2 hours ago

గిరిజనుల కోసం చెప్పులు లేకుండా కిలో మీటర్ నడిచిన పవన్!

దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి…

2 hours ago

ప్రేక్షకులను ఇలా కూడా కవ్విస్తారా ఉపేంద్రా?

ఇవాళ విడుదలైన ఉపేంద్ర యుఐకి ఊహించినట్టే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పినట్టు సినిమా అర్థం చేసుకోవడానికి కష్టపడాలని…

3 hours ago