కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌లో మరోసారి విజయం సాధించిన రాహుల్ ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ స్థానానికి ఎంపీగా కొనసాగుతారు, ఏ స్థానాన్ని వదులుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీలోనే ఆయన కొనసాగే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాహుల్ రాయ్ బరేలీని ఎంచుకునేందుకు అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన రాష్ట్రం. గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా యూపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతున్నది. ఈ ఎన్నికల్లో మాత్రం ఆరు స్థానాలు సాధించి మళ్లీ మెల్లగా పట్టు బిగించింది. ఈ నేపథ్యంలో యూపీలో బలపడే దిశగా రాయ్‌బరేలీ నుంచి కొనసాగేందుకు రాహుల్ మొగ్గు చూపవచ్చని అంచనా.
వయనాడ్ లో ఆయన సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాపై 364422 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. అక్కడ ఆయన 647445 ఓట్లు సాధించాడు. యూపీలోని రాయ్ బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పై 390030 ఓట్లతో విజయం సాధించాడు. ఇక్కడ రాహుల్ కు 687649 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో యూపీలోని అమేథీ, వయనాడ్ ల నుండి పోటీ చేసిన రాహుల్ అమేథీలో ఓడిపోయి వయనాడ్ లో గెలుపొందాడు. మరి కష్టకాలంలో అండగా ఉన్న వయనాడ్ ను వదులుకుంటే ఎలా అన్న వాదన కూడా వినిపిస్తున్నది. మరి రాహుల్ నిర్ణయం ఏం ఉంటుందో ? వేచిచూడాలి.
This post was last modified on June 6, 2024 10:19 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…