వైసీపీ పాలనలో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీ స్థాయి అధికారికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
‘నన్ను అక్రమంగా నిర్బంధించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లాను. 2023 ఫిబ్రవరి 20 వ తేదీన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒక అక్రమకేసులో నన్ను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
అర్ధరాత్రి కరెంటు తీసేసి జాషువా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయనను కలిసి బొకే ఇచ్చేందుకు అతని నివాసానికి వెళ్లాను. విజయవాడ సమీపంలో తన ఏడున్నర ఎకరాల్లో ఉన్న విలాసవంతమైన అతిథి గృహంలో ఉన్నారని తెలుసుకుని వెళ్లాను. పుషగుచ్చం, శాలువాతో సత్కారం చేద్దామని వెళ్లాను.
అయితే అతను ఇక్కడ లేరని, నిన్న ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ఆయన సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వెళ్లిపోయారని వాచ్‌మెన్ చెప్పారు. అతిథి గృహంలోనే ఒక కుర్చీలో పుష్పగుచ్ఛం, శాలువాను ఉంచి వీడియో ద్వారా తన సందేశాన్ని ఎస్పీ సెల్ ఫోన్‌కు పంపించా’’ అని పట్టాభి వెల్లడించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 , జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైసీపీ 11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఫలితాలతో వైసీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైనట్లు కనిపిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, కీలక నేతలపై అక్రమ కేసులు పెట్టించిన వైసీపీ ముఖ్య నేతలు కొంతమంది విదేశాలకు వెళ్తున్నారని సమాచారం. వారికి సహకరించిన అధికారులు కూడా ఒక్కొక్కరిగా రాజీనామాల బాట పడుతున్నారు. మరి కొంతమంది అధికారులు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on June 6, 2024 7:07 am
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…