అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. వైసీపీ ఓటమి గురించి ముందే సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని, కేవలం 11 సీట్లకు పరిమితం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్య నేతలు ఎన్నికల ముంగిట మాట్లాడిన కొన్ని మాటలు, చేసిన సవాళ్ల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూటమి మద్దతుదారులకు ఆ వీడియోలు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. అదే సమయంలో వైసీపీ వాళ్లకు తీరని మనోవేదన మిగులుస్తున్నాయి ఆ వీడియోలు.
ముందుగా జగన్ విషయానికి వస్తే.. ఆయన గత పర్యాయం 151 సీట్లతో సాధించిన విజయాన్ని మించి ఈసారి ఫలితాలు సాధించబోతున్నామని పదే పదే బల్లగుద్ది చెప్పారు. మీటింగుల్లో, ఇంటర్వ్యూల్లో ‘వై నాట్ 175’ అని నినదించారు. కట్ చేస్తే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తూ పాత వీడియోలను తిప్పుతున్నారు ప్రత్యర్థులు.
మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన సవాళ్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. చరిత్రలో ఏ నాయకుడికీ జరగని ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి జరుగుతుందని, అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తినీ విధి వదిలి పెట్టదని ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు వైసీపీ పరాజయానికి దీన్ని అన్వయించి చూపిస్తున్నారు టీడీపీ మద్దతుదారులు.
ఇక పవన్ పాత వీడియోలైతే చాలానే హైలైట్ అవుతున్నాయి. జగన్‌ను అథ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు, తన పార్టీ జనసేన కాదు అంటూ పవన్ సవాల్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే తాను రెండు చోట్ల ఓడిపోతానని ఎవరైనా అనుకున్నారా, అది జరిగింది కాబట్టి వైసీపీ 151 నుంచి 15కు పడిపోదని గ్యారెంటీ ఏంటి అని ఎన్నికల ముంగిట ఒక జనసేన మీటింగ్‌లో పవన్ వ్యాఖ్యానించిన వీడియో కూడా హైలైట్ అవుతోంది. ఈ వీడియోలతో వైసీపీ వాళ్ల ఓటమి బాధ ఇంకా రెట్టింపు అయ్యేలా చేస్తున్నారు టీడీపీ, జనసేన ఫ్యాన్స్.
This post was last modified on June 5, 2024 5:47 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…