దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8వ తేదీ రాత్రి 8గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జవహర్ లాల్ నెహ్రు తరువాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కనున్నాడు.
2014 తరువాత తొలిసారిగా బీజేపీ పార్టీ అధికారం అందుకోవడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. దాంతో ఎన్డీయే కూటమి పక్షాల మద్దతుతో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీయే పక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా లేఖలు ఇవ్వనున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎన్డీయేలో కేంద్ర మంత్రి పదవులకు డిమాండ్ పెరిగింది. ఏపీ నుంచి టీడీపీ కూటమికి 3 నుండి 5 మంత్రి పదువులు, జేడీయూకి 2 నుంచి మూడు, ఎల్జేపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు హెచ్ఏఎం, అప్పాదళ్, శివసేన షిండే వర్గంకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. మరి చివరలకి ఏం జరుగుతుందో వేచిచూడాలి.
This post was last modified on June 5, 2024 4:27 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…