ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గెలుస్తారని అనుకున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆయన భారీ స్థాయి లో వెనుకబడ్డారు. తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ప్రధాన మంత్రి 6 వేల ఓట్లకుపైగా వెనుకబడి పోయారు. 2014 లో తొలిసారి ఇక్కడ నుంచి పోటీ చేసిన ప్రధాని మోడీ.. భారీ విజయం నమోదు చేశారు. 80 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. రెండో సారి 2019లో పోటీ చేసి కూడా.. 60 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నారు. కానీ, ఈ సారి వెనుకబడి పోయారు.
వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈయన మూడో సారి వరుస గా పోటీలో ఉన్నారు. తొలి రెండు సార్లు ఆయన ఓడిపోయారు. ఇక, ఇప్పుడు రాయ్ దూకుడులో ఉన్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత.. రాహుల్ గాంధీ భారీ స్థాయిలో దూసుకుపోతున్నారు. ఈయన ఈ సారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కేరళలోని సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీ చేశారు.. ఇక్కడ ఇండియా కూటమి పార్టీ సీపీఐ ప్రత్యర్థిగా నిలిచింది.
సీపీఐ తరఫున అన్నీ రాజా పోటీలో ఉన్నారు. అయితే. వయనాడ్‌లో మరోసారి రాహుల్ దూసుకుపోతున్నారు.. 18 వేల ఓట్ల లీడ్ దక్కించుకున్నారు. ఇక, రాహుల్‌గాంధీ పోటీ చేసి మరో స్థానం.. రాయ్‌బరేలి. ఇది గాంధీల కుటుంబానికిబలమైన నియోజకవర్గం ఇక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు సోనియాగాంధీ. ఇలాంటి చోట.. రాహుల్ గాంధీ గెలుపును అందరూ ఊహించిందే. అయితే..పోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ, ఎలాంటి పోటీ లేకుండానే ఆయన దూసుకుపోతున్నారు. 40 వేల ఓట్లను లెక్కించేసరికి రాహుల్ 28 వేల ఓట్లు లభించాయి. దీంతో రాహుల్ రెండు స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు.
This post was last modified on June 4, 2024 10:04 am
హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవం మొదలుపెట్టిన దర్శకుడు బోయపాటి శీను…
రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన…
టాలీవుడ్ హీరోల లిస్టు తీస్తే అందులో 70-80 శాతం వారసులే కనిపిస్తారు. ఒకప్పుడు కేవలం హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యేవారు.…
సంక్రాంతికి ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ కావడం మామూలే. కానీ వాటిలో ఒకటి రెండు మంచి టాక్ తెచ్చుకుని…
ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ…
భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను సితాంశు కోటక్ చేపట్టనున్నారు. ఇటీవల టీమిండియా…