టీడీపీ నేతృత్వంలోని బీజేపీ-జనసేన కూటమి విజయం పరిస్థితి ఏంటి? వైసీపీని ఢీకొట్టి బలంగా ముం దుకు వస్తుందా? గెలుపు గుర్రం ఎక్కుతుందా? అనేది ఆసక్తిక ర విషయం. దీనిపై టీడీపీలో ఉన్న కీలక నాయకులు ఎవరూ ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ మా త్రం తన లెక్కులు తాను పదే పదే చెబుతున్నారు. ఎన్నికలు ముగిశాక.. లండన్‌కు వెళ్తూ.. ఆయన ఓ జోస్యం చెప్పారు. ఇక, పర్యటన ముగించుకుని రాబోయే ముందుకూడా జగన్ ట్వీట్ చేశారు.
దీనిలోనూ తామే గెలుస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైసీపీ ఇంత దూకుడుగా ఉంటే.. ప్రధాన ప్రతిపక్షం సహా కూటమి నాయకులు, ఎన్నికల ప్రచారాన్ని ఓ కీలక మలుపు తిప్పిన పవన్ వంటి నేతలు ఎక్కడా ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు. దీంతో అసలు ఏమైందనే చర్చ తెరమీదికి వచ్చింది. ఇదిలావుంటే.. విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తన అంచనాలను పార్టీ కీలక నేతలకు వెల్లడించారు.
అంతర్గత సమావేశంలో కీలక ముఖ్య నేతలతో చర్చించిన చంద్రబాబు తాను చేయించిన సర్వేలు.. ప్రజ ల నాడి వంటివాటిని అంచనా వేసుకుని.. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చంద్రబాబు లెక్కలు వేసుకు న్నారు. అత్యంత రహస్యంగా చంద్రబాబు చెప్పిన ఈ వివరాలు.. విశ్వసనీయ వ్యక్తులకు టీడీపీ నేతలు లీక్ చేశారు. దీని ప్రకారం.. కూటమి 110-122 స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశం ఉందని చంద్ర బాబు లెక్కలు వేసుకున్నారని చెప్పారు.
ఇక, మహిళా ఓటు బ్యాంకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం వైపు ఉందని.. అందుకే మహిళలు క్యూ కట్టి మరీ ఓటేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమ పింఛనును రూ.4000లకు పెంచుతామని.. ఏప్రిల్ నుంచే రూ.1000 కలిపి ఇస్తామని చెప్పడంతో వృద్ధులు తమకు ఓటేశారని.. బాబు నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. దీంతో తమ గెలుపు ఖాయమని చంద్రబాబు నమ్ముతున్నట్టు.. ధీమాగా ఉంటున్నట్టు చెప్పారు. పార్లమెంటు స్థానాల్లో టీడీపీ ఒంటరిగానే 13-14 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసినట్టు తెలిపారు.
This post was last modified on May 31, 2024 12:02 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…