Political News

మొత్తానికి రిటైర్మెంట్‌కు ముందు ఒక్క రోజు పోస్టింగ్‌ సాధించారుగా

ఏపీకి చెందిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి.. దాదాపు ఐదేళ్లుగా(మ‌ధ్య‌లో నాలుగు రోజులు మిన‌హా) స‌స్పెన్ష న్‌లో ఉన్న ఆలూరి బాల వెంక‌టేశ్వ‌ర‌రావు(ఏబీవీ) న్యాయ పోరాటం ఫ‌లించింది. ఆయ‌న‌ను త‌క్ష‌ణం విధుల్లోకి తీసుకోవాల‌న్న కేంద్ర ప‌రిపాల‌న ట్రైబ్యున‌ల్‌(క్యాట్‌) ఆదేశాల్లో జోక్యం చేసుకునేది లేద‌ని హైకోర్టు తేల్చి చెప్పిన ద‌రిమిలా.. ప్ర‌భుత్వం దిగి వ‌చ్చింది. గురువార‌మే రాష్ట్ర హైకోర్టుఈ విష‌యంపై తీర్పు వెలువ‌రించింది.

ఆ వెంట‌నే ఏబీవీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డిని క‌లిసి.. అటు క్యాట్ ఇచ్చిన ఉత్త‌ర్వులు, ఇటు హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కూడా ఆయ‌న‌కు అందించారు. త‌న‌కు పోస్టింగ్ ఇవ్వాల‌ని ఆయ‌న విన్నవించారు. దీనిపై ప‌రిశీల‌న చేసిన జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం.. ఏబీవీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలంటూ.. రాష్ట్ర డీజీపికి ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో సుదీర్ఘ న్యాయ పోరాటం.. అనంత‌రం సీనియ‌ర్ ఐపీఎస్‌కు పోస్టింగ్ ల‌భించింది.

కొన్ని గంట‌ల ముందు..

సీనియార్టీని బ‌ట్టి.. శుక్ర‌వారం ఏబీపీ త‌న విధుల నుంచి రిటైర్ అవుతున్నారు. ఈ రోజు మొత్తంలో ఆయ‌న ఎప్పుడైనా రిటైర్ కావొచ్చు. నిబంధ‌న‌ల ప్ర‌కారం .. శుక్ర‌వారం రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఆయ‌న‌కు పోస్టులో కొన‌సాగే అవ‌కాశంఉంది. ఈనేప‌థ్యంలో ఆయ‌న‌కు సంబంధించి పోస్టింగ్ ఇస్తూ.. డీజీపీ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత‌.. వెంట‌నే ఏబీవీ త‌న సీటులో కూర్చోనున్నారు. అయితే.. కొద్ది గంట‌లు మాత్ర‌మే ఆయ‌న ఈ పోస్టులో కూర్చునే అవ‌కాశం ఉంది. అయితే.. ఆయ‌న పోస్టింగులో కూర్చున్నా.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉండ‌దు. రిటైర్ అవుతున్న‌వారు.. అఖిల భార‌త స‌ర్వీసు నిబంధ‌న‌ల మేర‌కు.. ఎలాంటి నిర్ణ‌యాలూ తీసుకునే అవ‌కాశం లేదు. అదేవిధంగా ఆదేశాలు కూడా ఇచ్చే అవ‌కాశం లేదు.

నైతిక విజ‌యం

అయితే.. ఈ పోస్టింగ్ ద్వారా.. ఇప్ప‌టి వ‌ర‌కు నిలిచిపోయిన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు.. ఇత‌ర‌త్రా సొమ్ములు.. అదేవిధంగా తుది పోస్టింగ్ ఆధారంగా పింఛ‌ను వంటి ప్ర‌యోనాలు ద‌క్కించుకోన్నారు. అయితే.. జ‌గ‌న్ స‌ర్కారు వేధించింద‌ని.. త‌న‌ను రాచి రంపాన పెట్టింద‌ని.. ఏబీవీ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సుదీర్ఘ పోరాటంలో స‌ర్కారుపై నైతిక విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ఇప్పుడు ఆయ‌న‌కు ల‌భించిన భారీ ఊర‌ట‌గా చెప్పుకోవ‌చ్చు.

This post was last modified on May 31, 2024 11:59 am

Share

Recent Posts

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

1 hour ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

4 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

5 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

5 hours ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

6 hours ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

8 hours ago