టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు పూర్తిస్థాయిలో బిజీ అయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన ఎలా అయితే..బిజీ అయ్యారో.. ఇప్పుడు మరోసారి అంతే బిజీ అయ్యారు. మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితం విడుదల కానున్న నేపథ్యంలో పార్టీ నేతలను చంద్రబాబు అలెర్ట్ చేశారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి… ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు రావాలని కొందరు తమ్ముళ్లు నిర్ణయించుకున్నారు. పోలింగ్ తర్వాత. మెజారిటీ నాయకుల విదేశాలకు వెళ్లారు.
మరికొందరు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఫలితం కోసం నెలకొన్న టెన్షన్ నుంచి బయట పడేందుకు ప్ర యత్నించారు. కానీ, ఎన్నికల పోలింగ్ ఫలితం రావడానికి నాలుగు రోజుల ముందే నియోజకవర్గాలకు రావాలని.. వైసీపీ వ్యూహాలను ఎత్తగడలను కూడా.. అడ్డు కోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన విశ్రాంతి తీసుకుంటున్న నాయకులను హెచ్చరించారు. ఇక, హనీమూన్ అయిపోయింది..అలెర్ట్ కావాలని సూచించారు.
దీంతో విదేశాలకు వెళ్లిన నాయకులు ఏపీకి క్యూ కట్టారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారు కూడా తిరిగి వస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో మరోసారి సందడి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తల్లోనూ హుషారు చోటు చేసుకుంది. అయితే.. టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. దీంతో చంద్రబాబు పదే పదే టెన్షన్ వద్దని… ఎవరూ తొందర పాటుచర్యలకు పాల్పడవద్దని కూడా సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఇదే విషయాన్ని టెలీ కాన్ఫరెన్స్ పెట్టిమరీ చెప్పారు.
గెలుపు గ్యారెంటీ అని. ఈ విషయంలో సందేహం లేదని.. అలాగని ఎవరూ నిర్లక్ష్యంగ ఉండొద్దని కూడా.. చంద్రబాబు సూచించారు. పోలింగ్ ఏజెంట్లను ఎంపిక చేసుకోవడం.. సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిం చడం.. వంటివి ఖచ్చితంగా చూడాలన్నారు. వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగితే దీటుగా సమాధానం చెప్పాలని కూడా సూచించారు. మొత్తానికి చంద్రబాబు శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు.
This post was last modified on May 31, 2024 10:06 am
వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…
ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…