Political News

పిన్నెల్లికి షెల్ట‌ర్ ఇచ్చిందెవ‌రు? పొలిటిక‌ల్ హాట్ డిబేట్‌!

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి.. వివాదం అంద‌రికీ తెలిసిందే. ఈ నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ స‌మయంలో పిన్నెల్లి.. రెచ్చిపోయారు.. మాచ‌ర్ల‌లోని పోలింగ్ బూత్‌లో విధ్వంసం సృష్టించారు. అనంత‌రం.. సీఐ నారాయ‌ణ స్వామిని చావ‌బాదారు. పోలింగ్ ఏజెంట్ శేష‌గిరిపైనా దాడి చేయించారు. ఈఘ‌ట‌నల నేప‌థ్యంలో పిన్నెల్లిని అరెస్టు చేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశిం చింది. వాస్త‌వానికి ఈ ఘ‌ట‌న‌ల‌న్నీ జ‌రిగింది మే 13న. కానీ 20వ తేదీ వ‌ర‌కువెలుగులోకి రాలేదు.

అంటే.. దాదాపు 7 రోజుల పాటు వీటిని దాచిపెట్టారు. క‌ట్ చేస్తే.. ఈ లోపే పిన్నెల్లి మాచ‌ర్ల స‌హా ఏపీని వ‌దిలి వెళ్లిపోయారు. చిత్రం ఏంటంటే.. ఈయ‌న‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా ఏర్ప‌డ్డారు. మూడు రాష్ట్రాల‌కు వెళ్లారు. చెన్నై, బెంగ‌ళూరు.. హైద‌రాబాద్‌కు కూడా వెళ్లి శోధించారు. కానీ.. 8 రోజుల పాటు ఆయ‌న ఆచూకీని క‌నీసం కూడా ప‌ట్టుకోలేక పోయారు. ఇంకోవైపు.. ఇంకేముంది.. పిన్నెల్లి దేశం వ‌దిలి పారిపోయార‌న్న ప్ర‌చారం కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

మొత్తంగా చూస్తే.. హైకోర్టు నుంచి ముంద‌స్తు బెయిళ్లు వ‌చ్చే వ‌ర‌కు కూడా.. పిన్నెల్లిని ఎవ‌రూ గుర్తించ‌లేదు.. త‌నంత‌ట తాను వ‌చ్చి ఎస్పీ కార్యాల‌యంలో లొంగిపోతే త‌ప్ప‌.. ఎవ‌రూ ప‌ట్టుకోలేదు. దీంతో మ‌రి ఆ 8 రోజులు పిన్నెల్లి ఎక్క‌డ ఉన్నారు? ఎవ‌రు ఆయ‌న‌కు షెల్ట‌ర్ ఇచ్చారు? అనే ప్ర‌శ్న‌కు తాజాగా కొన్ని విష‌యాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. తెలంగాణ‌లో కీల‌క నేత‌.. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న ఓ నాయ‌కుడు పిన్నెల్లికి బంధువు అవుతార‌ని.. ఆయ‌న సౌజ‌న్యంతోనే పిన్నెల్లికి షెల్ట‌ర్ ల‌భించింద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

ఇక్క‌డ మ‌రో భారీ ట్విస్ట్ కూడా ఉందని అంటున్నారు. క‌ర్ణాక‌ట‌కు చెందిన కాంగ్రెస్ కీల‌క నాయ‌కుడు.. ప్ర స్తుతం ప్ర‌భుత్వంలో కీ రోల్ పోషిస్తున్న ఒక నేత కూడా.. పిన్నెల్లికి స‌హ‌క‌రించార‌ని స‌మాచారం.. అయితే.. ఈ మొత్తం ప‌రిణామాల‌కు కూడా.. అస‌లు కీ ఏపీలోనే ఉంద‌ని.. ఆ డైరెక్ష‌న్‌లోనే అన్నీ జ‌రిగాయ‌ని రాజ‌కీ య వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పిన్నెల్లి వెనుక చాలానే రాజ‌కీయం ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on May 31, 2024 9:59 am

Share
Show comments
Published by
Satya
Tags: Pinnelli

Recent Posts

ముందస్తు బెయిల్ నాకు వద్దు: చెవిరెడ్డి

వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…

3 hours ago

జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ ర‌చ్చ‌.. ఎందుకీ ఆరాటం?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి కేవలం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోస‌మే ఆరాట‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు…

4 hours ago

ఆరో ‘ఆట’ రద్దు.. ఏపీలో ఇకపై 5 ‘ఆట’లే

ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…

5 hours ago

గ్రామాల్లోనే టెంట్లు… వాటిలోనే పవన్ బస

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…

5 hours ago

డాకు మహారాజ్ చాలానే దాచి పెట్టాడు

https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…

6 hours ago

`బ్రాండ్ ఏపీ బిగిన్‌`: చంద్ర‌బాబు

బ్రాండ్ ఏపీ ప్రారంభ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అత‌లాకుత‌ల‌మైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామ‌ని చెప్పారు.…

6 hours ago