ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది. ఇక్కడ పోలింగ్ పర్సంటేజీ బాగానే నమోదైంది. 86.20 పోలింగ్ నమోదైంది. కానీ, ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ ద్విముఖ పోరు సాగలేదు. ఇతర నియోజకవ ర్గాలను తీసుకుంటే.. వైసీపీ వర్సెస్ కూటమి అభ్యర్థుల మధ్య పోరు సాగింది. దీంతో ఎవరు గెలు స్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పోనీ.. కొన్నికొన్ని నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు పోటీ చేసినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, ఎటొచ్చీ.. ఉండి నియోజకవర్గంలో ఏకంగా.. నలుగురు కీలక నాయకులు పోటీ చేశారు. వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. ఒకరు ఇండిపెండెంటుగా బరిలో నిలిచారు. ఈ పరిణామంతో ఇక్కడ త్రిముఖ పోరు సాగిందని స్ఫష్టంగా తెలుస్తోంది. వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహ రాజు బరిలో ఉన్నారు.
ఇక, టీడీపీ నుంచి చివరి నిముషంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీలో ఉన్నారు. దీంతో వీరి మధ్యే అసలు సిసలు పోటీ ఉంటుందని అంచనా వేసుకున్నారు. కానీ, చివరి నిముషంలోఇక్కడ వ్యూహం మారిపోయింది. తనకు టికెట్ దక్కలేదన్న ఆవేదనతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు.. కలువ పూడి శివ ఇండిపెండెంటుగా రంగంలోకి దిగారు. స్థానికంగా మంచిపేరు, స్థిర, చిర పరిచయాలు ఉండడం.. ఈయనకు మేలు చేస్తున్నాయి.
వీటితోపాటు.. గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి, ఇప్పుడు టికెట్ దక్కలేదన్న సానుభూతి కూడా .. కలువపూడి శివకు పని చేశాయని తెలుస్తోంది. ఇదేసమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గం.. కలువపూడి శివవైపే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. రఘురామ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి భారీ పార్టీలు ఇచ్చారు. రాజులను మచ్చిక చేసుకునేందుకు డబ్బులు కూడా పంచారు. అయితే.. ఫలితంపై మాత్రం తర్జన భర్జనే సాగుతుండడం గమనార్హం.
This post was last modified on May 30, 2024 11:46 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…