ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఇక, వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరూ తక్కువగా తీసేసే నాయకులు ఎవరూ కాదు. సీనియర్ నాయకుడు బూచేపల్లికి, కొత్తగా అరంగేట్రం చేసిన లక్ష్మికి కూడా రాజకీయంగా కుటుంబ పరం గా చూస్తే.. మంచి సంబంధాలు.. ప్రజలతో గట్టి అనుబంధం కూడా ఉంది. వీరిద్దరూ గట్టి పోటీనే ఇచ్చా రు.
దీనికితోడు రాష్ట్రంలోనే ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగి 90.91 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ చిత్రమై న వ్యవహారం ఒకటి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నేతలు గెలవాలని కోరుకుంటారు. ఎక్కడైనా బద్ధ వ్యతిరేకులు ఉంటే తప్ప.. అందరూ సవ్యంగా తమ నాయకులు గెలుపు గుర్రం ఎక్కాలని కూడా అభిలషిస్తారు. కానీ.. వైసీపీలోనే ఉన్న కీలక నేత ఒకరు.. టీడీపీ కోసం అంతర్గతంగా చక్రం తిప్పా రని అంటున్నారు స్థానికులు.
ప్రస్తుతం సదరు నేతపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఆయన ఎవరనేది అందరికీ తెలిసినా.. పేరు మాత్రం బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనకు గతంలో టీడీపీలో మంచి అనుబంధం ఉంది. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో టికెట్ కూడా ఆశించారు. కానీ, దక్కలేదు. దీంతో వైసీపీలోనే ఉండిపోయారు. పైకి మాత్రం మౌనంగా ఉన్నా.. అంతర్గతంగా టీడీపీ గెలవాలని కోరుకున్నారని.. పూజలు కూడా చేయించారని సమాచారం.
దీనికి కారణం.. వైసీపీలో ఉన్న తనకు ప్రాధాన్యం లేకుండా పోవడం.. తమపనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం.. నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం వంటి కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ విషయం తాడేపల్లి వరకు వెళ్లినట్టు సమాచారం. రేపు ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత.. ఈయన చేసిన పూజలు ఫలించి టీడీపీ కనుక గెలిస్తే.. ఈయనపై చర్యలకు వైసీపీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 30, 2024 7:31 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…