తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మారబోతున్నారా? అధ్యక్షురాలిగా సీతక్క బాధ్యతలు తీసుకోవడం ఖాయమా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షురాలిగా సీతక్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫలితాల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని హైకమాండ్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో తర్వాత ప్రెసిడెంట్ ఎవరూ అనే చర్చ జోరందుకుంది. ఇందులో సీతక్క వైపే అందరూ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ పదవిని దక్కించుకునేందుకు తెలంగాణలో పోటీ మాములూగా ఉండదు. సీనియర్ నాయకులు ఈ పదవిపై ఆశతోనే ఉంటారు. గతంలో సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పజెప్పినప్పుడు ఎలాంటి వ్యతిరేకత చెలరేగిందో చూశాం. కానీ రేవంత్ అవేమీ పట్టించుకోకుండా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు సీఎం అయ్యారు. దీంతో ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్‌కుమార్, మధుయాష్కీ తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. వీళ్లలో ఏ ఒకరికి ఆ పదవి ఇచ్చినా ఇతరుల నుంచి అసంతృప్తి తప్పదు.
అందుకే ఈ గొడవలేమీ ఉండకుండా సీతక్క పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిగా చేస్తే ఏ నాయకుడి నుంచి కూడా వ్యతిరేకత రాదని పార్టీ భావిస్తోందని సమాచారం. సీతక్క ఎంపిక అందరికీ ఆమోదంగానే ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా ఆమెకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గం ఆదరణ దక్కే అవకాశముంది. అలాగే మహిళల నుంచి పార్టీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని హైకమాండ్ ఆలోచిస్తుందని టాక్. మరి తెలంగాణలో పీసీసీ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సీతక్క ముందుకు వస్తారా? అన్నదే ప్రశ్న.
This post was last modified on May 25, 2024 4:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…