ఓవైపు సర్వేలన్నీ కూడా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పటం తెలిసిందే.
2019 ఎన్నికల్లో జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ సైతం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయంగా తేల్చేశారు. అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు.
చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒక తెలుగు టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈసారి ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశం లేదని.. ఏపీ ప్రజలు ఆయన్ను ఎన్నుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఓవైపు అందరూ ఎన్నికల్లో విజయం కూటమికే అంటూ తమ అభిప్రాయాన్ని చెబుతుంటే.. మరోవైపు సీఎం జగన్ మొదలుకొని ఆ పార్టీకి చెందిన వీర విధేయులు మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చెప్పటమే కాదు.. డేట్.. టైం కూడా ఫిక్సు చేస్తున్నారు. దీంతో.. అందరూ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి.
ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ క్రతువు పూర్తి అయ్యాక.. ఎన్నికల విజయం కూటమికే అన్న మాటను చెప్పటం.. కూటమి నేతలు సైతం ఇదే ధీమాను వ్యక్తం చేయటం తెలిసిందే.
అయితే.. వైసీపీ వర్గాలు సైతం తమదే గెలుపుగా తేల్చి చెప్పటమే కాదు.. తమకు వచ్చే సీట్ల సంఖ్యను.. తాము ప్రమాణస్వీకారం చేసే తేదీతో సహా.. ప్రభుత్వ ఏర్పాటు ముహుర్తాన్ని సైతం చెప్పేయటంతో తెలుగు తమ్ముళ్లు తమ అంచనాల్ని మరోసారి చెక్ చేసుకున్న పరిస్థితి.
ఎన్ని లెక్కలు వేసుకున్నా.. తమ బలాన్ని ఎంత తగ్గించి చూసుకున్నా.. గెలుపు అవకాశాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వైసీపీ వర్గం ప్రదర్శిస్తున్న గెలుపు ధీమా వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకూ గెలుపుపై అంతటి నమ్మకం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వస్తోంది.
ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాను ప్రదర్శించకుంటే అధికార యంత్రాంగం మీద ఉన్న పట్టు తప్పిపోవటమే కాదు.. ఓట్ల లెక్కింపు వేళకు.. ఏజెంట్లు కూడా లభించని పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు.
గెలుపు ఓటములు డిసైడ్ కావటానికి మరికొన్ని రోజులు సమయం ఉన్న వేళ.. దానికి ముందే వచ్చే అంచనాలతో బేలగా మారితే.. మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతోనే.. బింకం తగ్గని తీరును ప్రదర్శిస్తున్నట్లుగా విశ్లేషిస్తున్నారు.
ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో.. అధికారం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నంత వరకు అధికారులు తమకు తగ్గట్లు నడుచుకుంటారని.. చిన్నపాటి తేడాతో చాలానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
పులిస్వారీ చేస్తున్నప్పుడు.. దాన్ని కొనసాగించటమే తప్పించి కిందకు దిగే అవకాశమే ఉండదంటున్నారు.
ఫలితం జూన్ నాలుగున వస్తుందని.. అప్పుడు ప్రజాతీర్పు ఏదైతే దాన్ని అంగీకరించక తప్పదని.. దానికి ముందస్తుగానే చేతులు ఎత్తేయటం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. సీఎంగా ప్రమాణస్వీకారం తేదీ.. ముహుర్తం మొత్తం కూడా వ్యూహాత్మకమేనని చెప్పక తప్పదు.
This post was last modified on May 23, 2024 6:32 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…