ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అంటే విజయవాడ పేరే ప్రధానంగా వినిపించేదే. ఆ తర్వాత రాయలసీమ రేసులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏపీలో విశాఖపట్నం చుట్టూనే పొలిటికల్ హీట్ నెలకొందనే చెప్పాలి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి నేతల కళ్లు విశాఖపైనే పడ్డాయి. ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధాని అని పేర్కొంటూ ఇక్కడే వైసీపీ మకాం వేస్తోంది.
జగన్ మళ్లీ అధికారంలో వస్తే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తారని వైసీపీ చెబుతోంది. ఇందుకు అనుకూలంగా రుషికొండపై భవనాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరోవైపు టీడీపీ కూడా విశాఖపై ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది.
ఇటీవల టీడీపీ నాయకులు తరచుగా విశాఖపట్నానికి వెళ్లివస్తున్నారు. విజయవాడ, నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పుడు విశాఖపై మనసు పడుతున్నారు.
పోలింగ్ ముగిశాక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లారు. అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా విశాఖ వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇదే వరుసలో మరికొంతమంది టీడీపీ నాయకులు విశాఖకు వచ్చే అవకాశముంది.
విశాఖలో వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టేందుకే టీడీపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు టీడీపీ నేతలు విశాఖకు వెళ్తున్నా కూటమి అధికారంలోకి వచ్చాక అందరూ అమరావతిలోనే ఉండిపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on May 23, 2024 3:45 pm
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…