ఆశలు లేని స్థితి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేసి అధికారంలో తేవడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొనసాగించడంలోనూ ఆయన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు.
తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించేలా రేవంత్ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇప్పుడు దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నారు.
తాజాగా వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఈ స్థానాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ బరిలో దిగారు.
ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బరిలో దిగారు. ఇక ఈ సిటింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కూడా కష్టపడుతోంది.
కేటీఆర్ ఇక్కడ తమ అభ్యర్థి రాకేశ్ రెడ్డి విజయం కోసం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం కాంగ్రెస్ నాయకులకు మరింత ఉత్సాహాన్నిచ్చేదే.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన రేవంత్ తాజాగా జూమ్ సమావేశం నిర్వహించారు. తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు, కో ఆర్డినేటర్లతో రేవంత్ మాట్లాడారు. తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. మే 27న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికే ఓట్లు పడేలా చూడాలన్నారు.
2021లో ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న. . బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తరపున బరిలో దిగుతున్న ఆయన కచ్చితంగా విజయం సాధించేలా కనిపిస్తున్నారనే టాక్ ఉంది.
This post was last modified on May 23, 2024 3:41 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…