ప్రధాని నరేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గత కొన్నాళ్లుగా ప్రకటిస్తున్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి తీసుకుంటామన్న వ్యవహారంపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కూడా మద్దతిస్తామని.. తాము కూడా కోరుకుంటున్నది ఇదేనని తేల్చి చెప్పారు. పీవోకే.. భారత్‌లో అంతర్భాగమని తాము ఆది నుంచి చెబుతున్నట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. తమ మాటలను అప్పట్లో పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా పీవోకే వెనక్కి తీసుకుంటామంటే.. తమ మద్దతు కూడా ఉంటుందన్నారు.
“పీవోకే భారత్ భూ భాగమే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వెనక్కి తీసుకుంటే మేం హర్షిస్తాం. మద్దతిస్తాం. కానీ.. ఇప్పుడు ఎన్నికల వేళ చెబుతున్న మాటలు రేపు ఉంటాయా? అనేది మాత్రం మాకు సందేహం. ప్రజల భావోద్వేగాలతో ఎన్నికల ప్రక్రియను ముడిపెడుతున్నారు. దీనిని ఖండిస్తున్నాం” అని ఓవైసీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవోకే వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ, అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు.
కేవలం ఎన్నికల కోసం.. ప్రజలను రెచ్చగొట్టేందుకు మోడీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఓవైసీ దుయ్యబట్టారు. బీజేపీకి 400 సీట్టు వస్తాయా? అనేది వారే చెప్పాలన్నారు. దీనిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రతి విషయంలోనూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎలా 400 సీట్లు వస్తాయని ప్రశ్నిస్తే.. మాత్రం సమాధానం చెప్పలేక పోతున్నారని అన్నారు. ప్రజలపై పన్నులు వేసి..ధరలు పెంచినందుకు 400 సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలను మభ్య పెట్టే పార్టీలకు ఓటర్లు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ సారి యూపీలోనూ బీజేపీ ఎదురు దెబ్బతప్పదని అన్నారు. తాము యూపీలో పుంజుకుంటున్నామని 4 నుంచి 5 స్థానాల్లో విజయం ఖాయమని ఓవైసీ చెప్పారు.
This post was last modified on May 23, 2024 7:48 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…