తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంది మహాభారతం. పోనీ.. మనం భారత కాలంలో లేకపోయినా.. కనీసం.. కళ్లుముందు కనిపిస్తున్న నిజానికి ఒప్పుకొనే కలికాలాన్నికూడా దాటి అధఃపాతాళానికి పడిపోయామా? అని అనిపిస్తోంది.
ఎందుకంటే.. కళ్లముందు కనిపిస్తున్నది.. వైసీపీ ఎమ్మెల్యే, పైగా 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు.. నేరుగా పోయి..ఒక పోలింగ్ బూత్‌లో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా.. బరితెగించి.. ఈవీఎంను, వీవీ ప్యాట్‌ను నేలకేసి కొట్టారు. పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా.. అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం ఇది.
ఇంత బరితెగింపు ఎందుకు? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయమో.. లేక..తన ఆధిపత్యాన్ని చూపించాలని అనుకున్నా రో.. తెలియదు కానీ.. మొత్తానికి పిన్నెల్లి బరితెగించారు. చేయకూడని పని.. ఎవరైనా చేస్తే.. ఒకసీనియర్‌గా ఖండించాల్సిన పనిని తనే స్వయంగా తన చేతులతో చేసి.. ప్రజాస్వామ్యానికి, ఎన్నికల క్రతువుకుకూడా.. కళంకం తెచ్చారు.
ఈ క్రతువును ఖండించాల్సిన వైసీపీ.. సదరునేతపై .. చట్టం కంటే ముందుగా.. న్యాయస్థానాల కంటే ముందుగా.. చర్యలుతీసుకోవాల్సిన పార్టీ.. నిస్సిగ్గుగా.. నిర్మొహమాటంగా వెనుకేసుకు వచ్చింది. పిన్నెల్లి చేసింది తప్పుకాదని.. వైసీపీ పెద్దలు తేల్చేశారు.
ప్రజలుఏమనుకుంటారో.. అనే బిడియం కూడా లేకుండా.. వైసీపీ పిన్నెల్లిని వెనుకేసుకు వచ్చింది. పైగా ఆయన చేసిన పనిని సమర్థిస్తూ.. అక్కడ రిగ్గింగ్ జరిగింది
అని తేల్చి చెప్పడం మరింత దారుణం. నిజమే అనుకుందాం. రిగ్గింగ్ జరిగిందే అనుకుందాం. దీనిని వ్యతిరేకించేందుకు వ్యవస్థలు లేవా?
ఇదే విషయాన్ని ఆధారాలతో నిరూపించి.. న్యాయ పోరాటం ద్వారా.. మరోసారి ఎన్నికలు నిర్వహించేలా చేసి ఉంటే.. పిన్నెల్లి ఒక మెట్టు పైకి ఎక్కి ఉండేవారు. కానీ, తనే జోక్యం చేసుకుని.. తనే తీర్పరిలా.. ఓటర్ల ను అవమానించడం.. హెచ్చరించడం.. ఫక్తు రౌడీగా మారి.. ఈవీఎంలను పగలగొట్టడం వంటివాటిని పాలక పక్షం వెనుకేసుకురావడం.. ఎంత వరకు సమంజసం.. అనేది ప్రజాస్వామ్యవాదులునిలదీస్తున్న ప్రశ్న.
ఏదేమైనా.. మేమింతే! అని చెప్పుకొంటున్నారనేది వాస్తవం. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు.. తన డ్రైవర్‌ను చంపి.. డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా.. పార్టీ ఇలానే వ్యవహరించింది. పల్నాడు ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలుడు.. తన అక్కను వేధిస్తున్న వారిపై దాడి చేసినందుకు.. ఏకంగా అతనిని తగలబెట్టి మారణహోమం సృష్టించినప్పుడూ.. ఈ ఘటనను ఖండించలేక పోవడం.. పైగా నిందుతులకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం.. వైసీపీకి మాయని మచ్చలుగా మారాయి. ఇప్పుడు పిన్నెల్లి వ్యవహారం .. మరింత కళంకం తీసుకువస్తోంది.
This post was last modified on May 22, 2024 10:39 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…