పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టు భారీ ఉచ్చు బిగుసు కుంది. ఆయనను అరెస్టు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమయం నిర్ధారించింది. అసలు ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం నిలదీసినట్టు తెలిసింది. అయితే.. రామకృష్నారెడ్డి స్తానికంగా లేరని.. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారని.. సీఈవో చెప్పినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో పిన్నెల్లి ఎక్కడున్నా తక్షణం వెతకాలని.. సాయంత్రం 5 గంటల లోగా ఆయనను అరెస్టు చేసి.. అరెస్టు కాపీని తమకు పంపించేలా డీజీపీకి సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిం చింది. అంతేకాదు.. పిన్నెల్లి.. దేశం విడిచి పారిపోకుండా.. ఉండేలా.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయా లని.. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేయాలని కూడా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం పాటించేలా డీజీపీకి సూచించాలని తెలిపింది.
ఇదిలావుంటే.. ఎన్నికల సంఘం ఆదేశాలు రావడంతో మొత్తంగా 15 పోలీసులు బృందాలు.. ఒక్కొక్క దా నిలో ఐదుగురు చొప్పున ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. రెండుబృందాలు హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన మూడు.. కేరళ, తమిళనాడు, కర్ణాటకకు వెళ్లాయి. ఆయా రాష్ట్రాల్లో పిన్నెల్లి ఉన్నట్టుగా సమాచారం రావ డంతో అక్కడకు చేరుకున్నారు. ఈ సాయంత్రంలో గా ఎప్పుడైనా.. పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదేసమయంలో ఎన్నికల సంఘం అధికారులు.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా.. చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయానికి లేఖ రాసింది. దీంతో డీజీపీ కార్యాలయం.. రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ముందస్తు బెయిల్ కోరితే.. తమ వాదనలు కూడా వినాలని.. అప్పటి వరకు బెయిల్ ఇవ్వరాదని కూడా.. పిటిషన్ లో పేర్కొన్నారు.
This post was last modified on May 22, 2024 2:47 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…