పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ తనదే అధికారం అని అనుకోవడానికి లేదు. ఎన్నికలు వచ్చేంతవరకే ఏదైనా. ఒక్కసారి ప్రజలు ఓటుతో కొడితే ఎక్కడికో వెళ్లిపడాల్సిందే.
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నా ముందు నువ్వెంత, రా చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తొడ కొట్టారు. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం తిరుగుతున్నారని తెలిసింది.
మూడోసారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భావించి మల్లారెడ్డి లేనిపోని సవాళ్లు విసిరారు. రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆయన గెలిచారు సరే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. రేవంత్ సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో చేరేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారమూ జోరందుకుంది.
ఇక ఇప్పుడేమో భూ కబ్జా విషయంలో సీఎం రేవంత్‌ను కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. సుచిత్ర వద్ద ఉన్న భూ వివాదంలో మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. ఈ వివాదంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.
కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను ఇబ్బంది పెడుతున్నారని, ఈ భూమి తనదేనని మల్లారెడ్డి మరోసారి చెప్పారు. సీఎం అపాయింట్‌మెంట్ అడిగానని, రేవంత్‌ను కలిసి అన్ని విషయాలు తేల్చుకుంటానని మల్లారెడ్డి ప్రకటించారు. నేడో రేపో రేవంత్‌ను మల్లారెడ్డి కలిసే అవకాశముంది.
This post was last modified on May 22, 2024 2:43 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…