మెతుకుమెల్లి శ్రీభరత్. గీతం విశ్వవిద్యాలయం సీఈవోగా ఆయన అందరికీ సుపరిచితుడే. ఇక, నటసింహం బాలయ్య చిన్నల్లుడిగా కూడా.. ఆయన పేరు అందరికీ తెలిసిందే. విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ కోరినా.. పట్టుబట్టినా.. ససేమిరా అన్న చంద్రబాబు ఈ సీటును మాత్రం శ్రీభరత్‌కే కేటాయించారు. వాస్తవానికి ఇక్కడ వైసీసీ పెద్ద ప్రయోగం చేసింది. కాకలు తీరిన నాయకురాలు.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బోత్స ఝాన్సీని వైసీపీ నిలబెట్టింది.
దీంతో శ్రీభరత్ విజయం అంత ఈజీ అయితే కాదనే వాదన తొలినాళ్లలో వినిపించింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడి పోయారన్న సానుభూతి కనిపిస్తుందని అనుకున్నా.. బొత్స ఝాన్సీ వైసీపీ తరఫున ఇక్కడ ఎంట్రీ ఇచ్చాక.. పరిస్థితి మారిపోయిందని అనుకున్నారు. నిజానికి ఎన్నికల ప్రచారం ముందు ఆమెకు సానుకూల పవనాలు పెరిగాయి. దీంతో శ్రీభరత్ ఎదురీత చేయాల్సి వస్తోందని విశ్లేషణలు కూడా వచ్చాయి. ఈ సమయంలో కూటమి పార్టీల అండ ఎలా ఉందనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. మరోవైపు.. విశాఖలో గత ఐదేళ్లుగా ఉండి.. అనేక కార్యక్రమాలు చేసిన జీవీఎల్ నరసింహారావు టికెట్ ఆశించారు.
కానీ, ఆయనను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన అలిగి ప్రచారానికి దూరంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ భరత్‌కు మైనస్‌గా మారాయని విశ్లేషకులు లెక్కలు వేశారు. ఇక, జనసేన తరఫున కూడా.. నాయకులు ఇక్కడ కలిసి రావడం లేదన్నారు. అయితే..ఇవన్నీ.. ఎన్నికల పోలింగ్కు వారం ముందు మారిపోవడం.. అందరూ కలిసి రావడం.. ముఖ్యంగా సిటీ పరిదిలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పుంజుకోవడం వంటివి.. కూడా భరత్‌కు కలిసి వచ్చిన పరిణామంగా మారిందని తాజాగా అంచనాలు వస్తున్నాయి.
ఓ ప్రముఖ సర్వే సంస్థ.. కూడా విశాఖలో కూటమికి అవకాశం మెండుగా ఉంటుందని అంచనా వేసింది. మామ నందమూరి బాలయ్య.. చివరి క్షణంలో చేసిన ప్రచారం.. ఇతర కుటుంబ సభ్యులు కూడా.. కలిసి రావడం వంటివి భరత్ విజయానికి అవకాశం కల్పించిందని లెక్కలు కడుతున్నారు. దీంతో శ్రీభరత్‌కు కూటమి తరఫున ఈ దఫా గెలుపు తథ్యమనే అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల నేపథ్యంలో శ్రీభరత్.. తన వర్గానికి తాజాగా విందు ఇచ్చారని తెలిసింది. ఈ విందులకు పార్టీలో తనకు సహకరించిన వారిని, నియోజకవర్గంలో పనిచేసిన వారిని ఆయన ఆహ్వానించడం.. వారికి కానుకలు కూడా ఇవ్వడం వంటివి చూస్తే.. బాలయ్య చిన్నల్లుడు గెలుపు ఖాయమనే అంచనాలు నిజమేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 21, 2024 7:02 am
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…