ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం జగన్ మే 18న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే జూన్ 1న జగన్ తిరిగి ఏపీలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు, వైద్య పరీక్షల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా మే 18వ తేదీ రాత్రి హైదరాబాద్ నుండి అమెరికాకు వెళ్లారు.
అయితే, జగన్ మాదిరి కాకుండా చంద్రబాబు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. వైద్య పరీక్షలు ముగించుకొని ఐదారు రోజుల్లో చంద్రబాబు, భువనేశ్వరి హైదరాబాద్ చేరుకుంటారు.
మూడు నెలల పాటు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. వారణాసితోపాటు మహారాష్ట్రలోని పలు పుణ్యక్షేత్రాలను చంద్రబాబు, భువనేశ్వరి సందర్శించారు.
ఇక, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆల్రెడీ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి అమెరికా వెళ్లారు. లోకేష్ కూడా వారం రోజుల తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశముంది.
This post was last modified on May 19, 2024 12:51 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…