ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల పాటు సాగడం విశేషం. కానీ.. ఎక్కడా బయటకు కూడా పొక్కకుండా మొత్తం క్రతువును పూర్తి చేశారు. చివరి రోజు పూర్ణాహుతి సందర్భంగా మాత్రమే మీడియాకు ఫొటోలు విడుదల చేశారు. బుధవారం చివరి రోజు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ ఒక్కరే ఈ యాగంలో పాల్గొని క్రతువులు పూర్తి చేశారు.
బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు ఈ యాగాన్ని పూర్తి చేశారు. పూర్తిగా కార్యక్రమం అంతా కూడా.. సీఎం జగన్ నివాసంలోని ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో నిర్వహించారు. 41 రోజులు నిర్వహించిన రాజశ్యామల యాగంలో 45 మంది పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రక్ష
ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పడమట సురేష్ బాబు పరిశీలించినట్టు సమాచారం.
రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకునే ఉద్దేశం, కోరికతోనే ఈ రాజశ్యామల యాగాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు విశాఖలోని శారదా పీఠంలో ఈ యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు మొత్తం శారదా పీఠం నిర్వాహకులే యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు మాత్రం జగన్ ఇంట్లో నిర్వహించడం గమనార్హం. మరోవైపు.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఎక్కడా అజలేకపోవడం.. కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన వాయిస్ వినిపించకపోవడం గమనార్హం.
గత ఫిబ్రవరి నెలలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో దీనిని ఆయన నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా.. గత ఏడాది ఎన్నికల సమయంలో ఈ యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు.. యాగనిర్వహణతో ఆయన ఊపిరి సలపనంత బిజీ అయ్యారు. ఇక, ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా 41 రోజులు, 21, 16, 3 రోజులు కూడా చేయవచ్చు.
This post was last modified on May 16, 2024 10:11 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…