ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ ఓటర్లలో భారీగా చైతన్యం కనిపించిందని, అందుకే పోలింగ్ శాతం భారీగా నమోదైందని మీనా ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ 1.07 శాతం కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంటే మొత్తం పోలింగ్ 79.80 నమోదైంది. 2019 ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే 2024 ఎన్నికల్లో దాదాపు 2 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది.
82 శాతం పోలింగ్ జరగడంతో కూటమి పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసేందుకు జనం పోటెత్తారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి అధికారం కట్టబెట్టేందుకు మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తుది ఫలితాలు వచ్చే జూన్ 4 వరకు వేచి చూస్తేనే ఈ ఉత్కంఠకు తెర పడుతుంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం(ఫైనల్ గణాంకాలు మారొచ్చు)
వైఎస్సార్ జిల్లా -79.40 శాతం
పశ్చిమగోదావరి – 82.70 శాతం
విజయనగరం -81.34 శాతం
విశాఖ -71.11 శాతం
కర్నూలు -75.83 శాతం
కృష్ణ -84.05 శాతం
కాకినాడ -80.05 శాతం
గుంటూరు – 78.81 శాతం
తిరుపతి -77.82 శాతం
శ్రీకాకుళం -76.07 శాతం
సత్యసాయి -82.77 శాతం
నెల్లూరు -82.10 శాతం
ప్రకాశం -87.09 శాతం
పార్వతీపురం -77.10 శాతం
పట్నాడు -85.65 శాతం
ఎన్టీఆర్ -79.68 శాతం
నంద్యాల -80.92 శాతం
ఏలూరు -83.55 శాతం
తూర్పుగోదావరి -80.94 శాతం
కోనసీమ-83.91 శాతం
చిత్తూరు -87.09 శాతం
బాపట్ల-84.98 శాతం
అన్నమయ్య -76.23 శాతం
అనంతపురం -79.25 శాతం
అనకాపల్లి -83.84 శాతం
అల్లూరి -70.20 శాతం
This post was last modified on May 15, 2024 10:07 am
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…