దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆదివారం ఒకింత సేదదీరారు. ఎన్నికల టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరితో కలిసి ఆయన ఫుట్ బాల్ ఆడడం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిత్రం ఏంటంటే.. ఆట మధ్యలో సీఎం వేసుకున్న షూ(బూట్లు) పాడైపోయాయి. దీంతో వాటిని పూర్తిగా వదిలేసి మరీ చాలా ఇంట్రస్ట్ గా ఆయన ఫుడ్ బాల్ ఆడారు.
కాగా.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు ఒక్కొక్క రీతిలో విశ్రాంతి పొందుతారు. మరికొందరు అదే బిజీలో కూడా గడిపేస్తుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం.. ఒకింత రిలాక్స్ కోసం ఫుట్‌బాల్ ట్రై చేశారు. ఇదిలావుంటే.. ఎన్నికల ప్రచారం అనంతరం.. నాయకులు వ్యవహరించే తీరు కూడా.. మరుసటి రోజు జరిగే పోలింగ్‌పై ప్రభావం చూపిస్తుందని అంటారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలో వారు అనేక మందిని కలుస్తారు. తమకు అనుకూలమా.. ప్రతికూలమా.. అనేది వారికి తెలిసిపోతుంది.
తదుపరి రోజు వారి ముఖంలో ఈ ఛాయలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది సైకాలజీ చెప్పే విషయం. నాయ కులు హ్యాపీగా ఉన్నారని కనుక సంకేతాలు వస్తే.. ఫలితం కూడా వారికి అనుకూలంగా ఉంటుందనే అర్ధ మవుతుంది. అలా కాకుండా.. నాయకులు ఇంకా టెన్షన్ పడుతుంటే.. వారి పరిస్తితి అటు ఇటుగా ఉందని అంచనా వేసుకుంటారు. అయితే. ఇప్పుడు నాయకులు.. క్షేత్రస్థాయిలో పరిస్తితి ఎలా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం ధీమా సంకేతాలనే పంపిస్తున్నారు.
తాజాగా సీఎం రేవంత్ కూడా ఫలితంతో సంబంధం లేకుండా. ప్రజలకు మాత్రం సానుకూల సంకేతాలు పంపించడం గమనార్హం. రేవంత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హెచ్‌సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.
This post was last modified on May 12, 2024 3:19 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…