Political News

యంగ్ అండ్ డేరింగ్ ఎంపీ.. హ్యాట్రిక్ ప‌క్కా!

లోక్‌స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌శ్నించిన నేత‌గా టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌త్యేక‌త సంపాదించుకున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్ర‌త్యేక హోదా కోసం లోక్‌స‌భ‌లో రామ్మోహ‌న్ నాయుడు పోరాడారు. స‌భ‌లో ఆయ‌న స్పీచ్‌లు ఏపీలో జ‌నాల‌ను ఉర్రూత‌లూగించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా రాష్ట్రంలో జ‌రుగుతున్న అన్యాయం, అరాచ‌కం మీద‌.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పార్లమెంట్‌లో గ‌ళం వినిపించారు. ఇలాంటి యంగ్ అండ్ డేరింగ్ నేత ఎంపీగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు.

వ‌రుస‌గా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచేందుకు టీడీపీ నాయ‌కుడు రామ్మోహ‌న్ నాయుడు రంగం సిద్ధం చేసుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న విజ‌యాన్ని వైసీపీ అడ్డుకోలేద‌ని టాక్‌.

రామ్మోహ‌న్ నాయుడికి పోటీగా వైసీపీ నుంచి పేరాడ తిల‌క్‌, కాంగ్రెస్ త‌ర‌పున పేడాడ ప‌ర‌మేశ్వ‌ర‌రావు బ‌రిలో ఉన్నారు. కానీ వీళ్లిద్ద‌రూ రామ్మోహ‌న్‌కు అసలు పోటీనే కాద‌ని చెప్పాలి. వైసీపీపై జ‌నాల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త రామ్మోహ‌న్‌కు మ‌రింత‌గా క‌లిసొచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

2019లో శ్రీకాకుళం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అయిదు చోట్ల గెలిచింది. అయినా జ‌గ‌న్ వేవ్‌ను త‌ట్టుకుని రామ్మోహ‌న్ ఎంపీ సీటు నిల‌బెట్టుకున్నారు. అలాంటిది ఈ సారి వైసీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో రామ్మోహ‌న్ విజ‌యం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అసెంబ్లీ సీట్లు ద‌క్క‌క‌పోవ‌డంతో కాస్త అసంతృప్తితో ఉన్న ఇక్క‌డి టీడీపీ నాయ‌కుల‌ను బుజ్జగించి రామ్మోహ‌న్ దారిలోకి తెచ్చుకున్నారు. మ‌రోవైపు వైసీపీలో వ‌ర్గ‌పోరు కూడా ఆయ‌న‌కు క‌లిసి రానుంది. ముఖ్యంగా ధ‌ర్మాన కుటుంబంలో వైసీపీ నాయ‌కులున్నా.. లోలోప‌ల మాత్రం రామ్మోహ‌న్‌కు మ‌ద్ద‌తు ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

This post was last modified on May 11, 2024 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

1 hour ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

2 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

3 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

3 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

4 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

5 hours ago