సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు, కండువాలు మార్చేసిన జంపింగ్ జపాంగ్‌ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీలను, రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చిన అధినేతలను కూడా టికెట్ల కోసం వదిలేసిన నాయకులు ఇతర పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకున్నారు. వీరు గెలుస్తారా? ఓడుతారా? అనేది చర్చకు వస్తోంది.
— తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆరణి శ్రీనివాసులు ఎన్నికలకు కొద్ది వారాల ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరారు. వెంటనే ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చారు. అన్నట్లు ఆరణి వైసీపీ నుంచి గత ఎన్నికల్లో చిత్తూరు స్థానంలో విజయం దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం గమనార్హం.
— 2019లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరి ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఈ పార్టీ తరపున మరోసారి మచిలీపట్నం నుంచే పోటీ చేస్తున్నారు.
— భీమవరం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు టీడీపీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన టీడీపీ నుంచి జంప్ చేసి జనసేన తీర్థంపుచ్చుకున్నారు. అదే చేత్తో టికెట్ అందుకుని బరిలో నిలిచారు.
— అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరఫున పోటీలో ఉన్న సీనియర్ నేత కొణతాల రామకృష్ణ చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది మాసాల ముందు ఆయన జనసేన తీర్థం పుచ్చుకుని టికెట్ దక్కించుకున్నారు.
— విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీ కృష్ణయాదవ్ జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. కానీ, ఈయన కూడా ఎన్నికలకు కొన్ని మాసాల ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీ టికెట్ పై బరిలో నిలిచారు.
— విజయవాడ ఎంపీగా ఉన్న టీడీపీ నేత కేశినేని నాని ఆ పార్టీతో విభేదించి వైసీపీలో చేరారు. ఆ వెంటనే ఆయనకు ఇక్కడ నుంచే వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడం విశేషం. చిత్రం ఏంటంటే కండువా కప్పుకోక ముందే ఆయనకు టికెట్ ప్రకటించారు.
— హిందూపురం లోక్‌సభ స్థానం వైసీపీ అభ్యర్థిగా జోలదరాశి శాంతకు కూడా వైసీపీ అనూహ్యంగా టికెట్ ప్రకటించింది. ఆమె పార్టీ కండువా కప్పుకోక ముందే టికెట్ ప్రకటించడం గమనార్హం.
— రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని డాక్టర్ సంహాద్రి చంద్రశేఖర్‌ను వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయనను పార్టీలో చేర్చుకుని అనంతరం.. టికెట్ ఇచ్చింది.
— గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీలో చేర్చుకుని వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే.. ఆయన గత నాలుగున్నరేళ్లుగా వైసీపీకి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.
— విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కూడా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. ఆయన కూడా నాలుగేళ్లకు పైగా వైసీపీకి మద్దతుగా రాజకీయాలు చేశారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది.
— టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావుకు తాజా ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో వైసీపీలో చేరి ఆ వెంటనే రాజోలు(ఎస్సీ) టికెట్ దక్కించుకున్నారు.
— తిరువూరులో టీడీపీ నేతగా ఉన్న నల్లగట్ల స్వామిదాసును ఎన్నికలకు కొన్ని వారాల ముందు పార్టీలో చేర్చుకున్న వైసీపీ ఆవెంటనే ఆయనకు టికెట్ ప్రకటించింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధిని పక్కన పెట్టేసింది.
ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న వాసంశెట్టి సుభాశ్‌కు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో టీడీపీ బాట పట్టారు. ఆ వెంటనే ఆయన టీడీపీ నుంచి రామచంద్రపురం టికెట్ దక్కించుకున్నారు.
— పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత కొలుసు పార్థసారథికి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. ఆయన పార్టీలో చేరకముందే.. టీడీపీ నూజివీడు టికెట్ ప్రకటించింది.
— గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన కూడా టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.
— కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న వైసీపీ నేత గుమ్మనూరు జయరాంకు ఆ పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. దీనికి నిరాకరించిన జయరాం టీడీపీలో చేరి గుంతకల్ అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు.
— ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఈయన కూడా టీడీపీలో చేరి అదే టికెట్ సొంతం చేసుకున్నారు.
— నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్యెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఈయన టీడీపీలో చేరి ఆత్మకూరు నియోజకవర్గం టికెట్ దక్కించుకున్నారు. గత 2019 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న ఈయన అప్పట్లో వైసీపీలో చేరి టికెట్ దక్కిం చుకోగా.. ఇప్పుడు వైసీపీ నుంచి మళ్లీ టీడీపీ బాట పట్టారు.
— ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, వేమిరెడ్డి ప్రభాకర్‌లు(దంపతులు) ప్రత్యక్ష ఎన్నికల్లో టికెట్లు దక్కకపోయే సరికి, టీడీపీలో చేరి పోయారు. ఈ క్రమంలో కోవూరు అసెంబ్లీ టికెట్‌ను వేమిరెడ్డి ప్రశాంతి, నెల్లూరు ఎంపీ టికెట్‌ను ప్రభాకర్ రెడ్డి దక్కించుకున్నారు.
— నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీతో విభేదించి టీడీపీకి జై కొట్టారు. ఈ క్రమంలో ఆయన కూడా దేశం తరఫున నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
— ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఆ పార్టీ ఈ దఫా ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. అయితే, ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించి.. టీడీపీలో చేరారు. అనంతరం ఆయన సత్యవేడు అసెంబ్లీ టికెట్ దక్కించుకుని పోటీలో నిలిచారు.
This post was last modified on May 11, 2024 11:06 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…