ఏపీలో ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఒకరకంగా.. 98 శాతం మంది ఉద్యోగులు ఓటేశారు. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే.. ఏపీలో ముగిసింది. మిగిలిన ఒకటి అరా ఉంటే.. తర్వాత.. వేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఇంత మంది పోటెత్తడం అంటే.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనేది విపక్షం మాట.
ఇది నిజమే కావొచ్చు. ఒక్కొక్కసారి ప్రభుత్వంపై వ్యతిరకత ఉన్నప్పుడు.. ఇలానే పోటెత్తుతారు. అయితే.. అలాగని ఇది పూర్తిగా నిజమని కూడా చెప్పలేం. ఎందుకంటే.. జగన్ హయాంలోనూ.. వివిధ రూపాల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎడ్మిన్‌లుగా.. కార్యదర్శులుగా ఏకంగా 1.32 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వైద్య, విద్య రంగాల్లోనూ 22 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇతర శాఖల్లోనూ మొత్తంగా 40 వేల మంది ఉద్యోగాలు పొందారు.
వీరంతా కూడా.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారా? ఆ అవసరంఉందా? అనేది ప్రశ్న. ఉందని కొందరు చెబుతున్నారు. సమయానికి జీతాలు ఇవ్వకపోవడం ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇది అయ్యే అవకాశం ఉంది. ఇక, ఉపాధ్యాయులు పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు తమ పింఛను రద్దు చేయలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ రెండు వర్గాల వారు కూడా.. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అయితే.. ఎవరికి అనుకూలంగా వేశారనేది ఇప్పటి వరకు ఇతమిత్థంగా తెలియడం లేదు. అయితే.. సీపీఎస్ రద్దు విషయంలో కొంత మేరకు సానుకూలంగా స్పందించిన జనసేన వైపు ఎక్కువగా ఉన్నారని ఒక టాక్. అదేవిధంగా చంద్రబాబు వస్తే.. తమకు రాజధాని ఏర్పడుతుందని.. తమ వారికి ఉపాధి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్న ఉద్యోగులు ఈ వైపు నిలబడ్డారనే అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా.. భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ నమోదు కావడం మాత్రం ఆసక్తిగా మారింది. జూన్ 4న వీటిని లెక్కించనున్నారు.
This post was last modified on May 10, 2024 3:39 pm
వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు ఏవీ చేస్తారనే దాని గురించి రకరకాల…
తన పాటలు, ట్యూన్లు ఎవరు వాడుకున్నా వాళ్ళను విడిచిపెట్టే విషయంలో రాజీపడని ధోరణి ప్రదర్శించే ఇళయరాజా ఈసారి గుడ్ బ్యాడ్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ (ఈడీ)…
కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వొచ్చేమో కానీ ఖలేజాకు తర్వాతి కాలంలో కల్ట్ ఫాలోయింగ్ దక్కింది. ముఖ్యంగా టీవీ ఛానల్స్, ఓటిటిలో…
గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ… నాటి భూ రికార్డుల…