బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒకట్రెండు సీట్లు గెలిచే అవకాశాలూ లేవనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో.. కేసీఆర్‌కు అన్ని రకాలుగా స్ట్రోక్ ఇస్తోంది. తాజాగా తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శరీరానికి నిప్పు అంటించుకుని చనిపోయిన శ్రీకాంత్ చారి తల్లి ఇప్పుడు కేసీఆర్‌ను కాదనడం హాట్ టాపిక్ అయింది.
ఉద్యమకారులు గుడ్‌బై చెబుతుండటంతో ఏకాకిగా కేసీఆర్ మిగిలిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్‌కు వాళ్ల ఉసురు తగులుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దెనెక్కాననే అహంకారంతో ఉద్యమకారులను కేసీఆర్ అవమానించారనే విమర్శలున్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ ద్రోహులను పిలిచి మరీ పక్కన పెట్టుకున్నారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం లాంటి అసలైన ఉద్యమ కారులు కేసీఆర్‌కు దూరమయ్యారు.
రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యమాలనే అణగదొక్కారనే విమర్శలున్నాయి. దీంతో తెలంగాణ ఉద్యమ కారులు కేసీఆర్‌పైనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక గత ఎన్నికల్లో ఓటమితో భంగపడ్డ కేసీఆర్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతున్నారనే చెప్పాలి. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌పై శంకరమ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శ్రీకాంత్ చారి మరణానికి విలువ ఇవ్వని కేసీఆర్.. ఉద్యమ ద్రోహులకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. భువనగిరి ఎంపీ టికెట్ ఆశించినా కేసీఆర్ తిరస్కరించారు. గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పట్టించుకోలేదు. దీంతో ఆమె తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ చేరానని చెప్పారు. శంకరమ్మకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on May 10, 2024 3:36 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…