Political News

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !

దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసిన కోయంబత్తూర్, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి పోటీ చేసిన తమిళిసై చెన్నైసౌత్, ఓవైసీ మీద బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గాలతో పాటు, సంచలనం రేపిన సెక్స్ స్కాండల్ వివాదం నేపథ్యంలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నియోజకవర్గం చేరింది.

దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో 283 స్థానాల‌లో పోలింగ్ ప్రక్రియ పూర్త‌యింది. మ‌రో 4 విడ‌త‌ల్లో మిగిలిన స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా నాలుగో విడ‌తలో భాగంగా 96 లోక్ స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒకే విడతలో ఎన్నికలు ముగియనున్నాయి. ఇందులో ఏపీలో 175 శాసనసభ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ లోక్ సభ స్థానం ఉండడం విశేషం.

రాహుల్ కేరళ నుండి పోటీ చేసిన వాయనాడ్, తమిళనాడు నుండి తమిళిసై పోటీ చేసిన చెన్నై సౌత్, అక్కడి బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూరు స్థానాలతో పాటు దేవెగౌడ మనవడు పోటీ చేసిన హసన్ స్థానాలలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. హైదరాబాద్ స్థానానికి ఈ నెల 13న ఎన్నిక జరగనుంది. ఇక్కడ భారీ ఎత్తున ఓట్లు తొలగించడం, మాధవీలత ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షిస్తుండడం అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నది. నాలుగు దశబ్దాలుగా ఓవైసీల చేతిలో ఉన్న హైదరాబాద్ కంచుకోటను మాధవీలత బద్దలు కొట్టగలదా అన్న చర్చ నడుస్తున్నది.

ఇక వాయనాడ్ లో పోటీ చేసిన రాహుల్ గాంధీ తిరిగి ఈ సారి గతంలో యూపీ నుండి ఓడిపోయిన అమేథీ నుండి కాకుండా తన తల్లి ఖాళీ చేసిన రాయ్ బరేలీ నుండి పోటీ చేయడం చర్చకు దారితీసింది. మరి రెండింట్లో నెగ్గితే రాహుల్ దేన్ని ఎంచుకుంటాడు ? వాయనాడ్ లో ఇంతకు గెలుస్తాడా ? లేడా ? అన్న చర్చ నడుస్తున్నది. వాయనాడ్ లో రాహుల్ కు పోటీగా సీపీఎం నుండి అన్నీ రాజా, బీజేపీ నుండి ఆ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ లు గట్టి పోటీ ఇచ్చారు.

ఏకంగా గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై పోటీ చేసిన చెన్నై సౌత్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూరులు అందరినీ ఆకర్షించడం ఇప్పటి వరకు తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవకపోవడమే. ఈసారైనా ప్రభావం చూపుతుందా అని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కర్ణాటక హసన్ లో ఎన్నికలు ముగియగానే దేశం దాటిన ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో ఇది కూడా హాట్ సీట్ గా మారింది. మరి ప్రజల తీర్పు ఎలా ఉందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

This post was last modified on May 11, 2024 8:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు దశాబ్దాల తర్వాత ఆరు జోడి

ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…

5 hours ago

ప్ర‌జ‌ల‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్తున్న చంద్ర‌బాబు!

అదేంటి.. అనుకుంటున్నారా? ప్ర‌పంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారా?…

7 hours ago

విశ్వక్సేన్.. ప్రమోషన్ల మాస్టర్

ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…

7 hours ago

పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…

7 hours ago

ఏఆర్ రెహమాన్.. బ్యాడ్ న్యూస్ తరువాత గుడ్ న్యూస్

భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…

7 hours ago